Khammam: కామేపల్లిలో విషాదం.. కారులో ఊపిరాడక బాలుడు మృతి
ఇంటి ఆవరణంలో ఉన్న కారు ఓ బాలుడ్ని బలి తీసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కారు ఎక్కి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కారు డోర్ మూసుకుపోంది. ఎవరు చూడక పోవటంతో ఊపిరాడక పార్థు మృతి చెందాడు.
ఇంటి ఆవరణంలో ఉన్న కారు ఓ బాలుడ్ని బలి తీసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కారు ఎక్కి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కారు డోర్ మూసుకుపోంది. ఎవరు చూడక పోవటంతో ఊపిరాడక పార్థు మృతి చెందాడు.
రానున్న ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.
తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం కార్యాక్రామానికి అనుచరులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ముందుగా 2 వేల కార్లు, బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జెండా లేకపోవడం గమనార్హం. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండాలు దర్శనమివ్వడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోతున్నారనే వార్తకు మరింత బలం చేకూరింది.
వైఎస్సార్ తెలంగాణ పార్టీకి చెందిన నాయకుడు అమన్ మృతితో షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మేకల కుంట గ్రామంలో పార్టీ యువనేత అమన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల.. అమన్ కుటుంబ సభ్యులను ఓదార్చి, కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తక్షణ సహాయం కింద అమన్ కుటుంబానికి షర్మిల 3లక్షలు అందజేశారు.
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరిగే శాసనసభ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించారు. కాని నియోజకవర్గాల్లో క్యాడర్ నుంచి వస్తున్న వ్యతిరేకత.. సీనియర్ లీడర్ల నిరసనలతో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో 10 మందికి బీఫారం కష్టమేననే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్ నేత, ఆర్థిక మంత్రి హరీష్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మల్కాజ్గిరి అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావును మారుస్తారనే ప్రచారం ఉన్నా.. ఆయనతో పాటు మరో 9మందికి గులాబీ బాస్ నో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ట్రాన్స్జెండర్లు అంటే సమాజంలో చులకన ఉంటుంది. వారిని అందరూ చిన్నచూపు చూస్తుంటారు. కొంతమంది ట్రాన్స్జెండర్లు చేసే తప్పుల వల్ల మొత్తం ఆ కమ్యూనిటికే చెడ్డ పేరు వస్తుంది. వారు భిక్షాటన చేయడానికి తప్ప ఇంకెందుకు పనికి రారనే భావన ఉంది. కానీ తెలంగాణకు చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ మాత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అడుగులు ఎటు వైపు? ఖమ్మం జిల్లా పాలేరు నుంచి తనకే టికెట్ వస్తుందని భావించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి కేసీఆర్ షాక్ ఇవ్వడంతో ఆయన అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. ఇటు కాంగ్రెస్, బీజేపీకి చెందిన రాజకీయ పెద్దలతో తుమ్మలకు మంచి సంబంధాలే ఉన్నాయి. భవిష్యత్ కార్యాచరణకు తుమ్మల ఇప్పటికే సిద్ధమయ్యారని తెలుస్తోంది.
లెఫ్ట్ పార్టీలకు సీఎం కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్మూనిస్టుల సపోర్ట్ తీసుకున్న కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం లెఫ్ట్‌పార్టీలను పట్టించుకోలేదు. ఇప్పటికే అభ్యర్థుల జాబిత విడుదల చేసిన కేసీఆర్ కేవలం నాలుగు స్థానాలను మాత్రమే పెండింగ్‌లో పెట్టారు. ఆ నాలుగు స్థానాలు కూడా కమ్యూనిస్టులు కోరిన స్థానాల జాబితాలో లేవు.
బీఆర్ఎస్ టిక్కట్లు చేజార్చుకున్న ఆ ఏడుగురు ఎమ్మెల్యేలపై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. సిట్టింగుల్లో ఏడుగురికి అవకాశం దక్కలేదు. వేములవాడ, బోధ్, ఉప్పల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, కామారెడ్డి, వైరా, స్టేసన్‌ఘన్‌పూర్ సిట్టింగులకు టికెట్ ఇవ్వట్లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవహార శైలి, వివాదాలే దీనికి ప్రధాన కారణాంగా తెలుస్తోంది.