Young Scientist: యువ శాస్త్రవేత్తను మింగేసిన ఆకేరు వాగు!
మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగును దాటే క్రమంలో కారు గల్లంతు కావడంతో.. యువ వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని సహా ఆమె తండ్రి గల్లంతయ్యారు. వారి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి.
మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగును దాటే క్రమంలో కారు గల్లంతు కావడంతో.. యువ వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని సహా ఆమె తండ్రి గల్లంతయ్యారు. వారి మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి.
భారీ వర్షాల వల్ల హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పై రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు వాగు ఉధృతంగా ప్రవాహిస్తుండడంతో సూర్యాపేట- ఖమ్మం, హైదరాబాద్ నుంచి కోదాడ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను నిలిపివేశారు.
ఖమ్మంలోని ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై వరద నీటిలో చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితంగా బయటకు వచ్చారు. మున్నేరు వాగు చూసేందుకు వెళ్లిన తొమ్మిది మంది ఆదివారం సాయంత్రం బ్రిడ్జిపై చిక్కుకుపోయారు.స్థానికులు ఏర్పాటు చేసిన జేసీబీల సాయంతో మరోవైపు నుంచిబయటకు వచ్చారు
హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం రాకపోకలు పూర్తిగా స్థంభించిపోయాయి. సూర్యపేట-ఖమ్మం మార్గంలో పాలేరు నది పొంగిపొర్లుతోంది. దీంతో అత్యవసర ప్రయాణాలు ఉన్నవారికోసం కొన్ని ప్రత్యేక రూట్లు సూచించారు పోలీసులు.
మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెంలో ఆకేరు వాగు ఉధ్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఓ కారు అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయింది. అందులో ఉన్న నూనావత్ మోతిలాల్, అతని కూతురు అశ్విని కూడా గల్లంతయ్యారు. వారి ఆచూకి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు.
భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్ని నీటమనిగాయి. కుసుమంచి మండలం నాయకన్‌గూడెంలో విషాదం చోటుచేసుకుంది. పాలేరు వాగులో చిక్కుకున్న కుటుంబంలో దంపతులు గల్లంతయ్యారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా జలదిగ్బంధమయ్యింది. నగరంలో పలు కాలనీలను వరద ముంచెత్తింది. రాజీవ్ గృహకల్ప ఇళ్ల సముదాయాలు నీటమునిగాయి. దీంతో భవనాల టెర్రస్‌పైకి వెళ్లి దాదాపు 200 కుటుంబాలు తల దాచుకుంటున్నాయి. తమను రక్షించాలని వేడుకుంటున్నాయి.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి బండి సంజయ్ తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ను ఆదేశించారు.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.