/rtv/media/media_files/2025/01/22/I6MlYtCMs0SkP1ybqN80.jpg)
The company is cheating in the name of jobs
The company is cheating in the name of jobs : తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల పేరుతో యువతి, యువకులను మోసం చేస్తున్న సంస్థ మోసాలు గుట్టు రట్టయింది.చండీగఢ్ కు చెందిన ఈ సంస్థ ఇండియా బిజినెస్ పేరుతో మోసాలు చేస్తోంది. బార్ కోడ్ ,క్యూఆర్ కోడ్ క్రియేషన్, డేటా ఎంట్రీ జాబ్ పేరుతో యువతి , యువకులకు భారీ ఆఫర్ తో ఇండియా బిజినెస్ ఆహ్వానించింది. ఉచితంగా జాబ్ ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.3వేల నుంచి 70వేల వరకు వసూళ్లకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలతో పాటు, ఏపీలోని విశాఖ, గుంటూరు జిల్లాలకు చెందిన అనేక మంది యువతీ, యువకులకు ఈ సంస్థ వల విసిరింది. ఉద్యోగాల ఆశ చూపడంతో అనేకమంది యువకులు మోసగాళ్ల చేతిలో చిక్కుకున్నారు.అక్కడికి వెళ్లిన తర్వాత చైన్ లింక్ పేరుతో దోపిడికి పాల్పడుతున్నట్లు గుర్తించిన ఖమ్మం జిల్లా వైరాకు చెందిన యువతి ప్రశ్నించడంతో యువతిని గొంతు కోస్తామని బెదిరింపులు. మోసగాళ్ల చెర నుంచి తప్పించుకుని ఖమ్మం చేరిన 15 యువకులు. కాగా వరంగల్ వరకు వచ్చిన యువతిని వరంగల్ రైల్వేస్టేషన్లో హత్య చేసేందుకు చండీగఢ్ టీం కు చెందిన కత్తి భాస్కర్ అనే వ్యక్తి కొద్దిమంది వ్యక్తులను పురమాయించాడు. బ్లేడ్ తో గొంతు కోస్తామని, గ్యాస్ సిలిండర్ తో పీల్చేస్తామని యువతిని బెదిరించిన రౌడీషీటర్లు. వారి బెదిరింపులను సెల్ ఫోన్లో రికార్డ్ చేసి ఖమ్మం సీపీకి పంపిన యువతి మధులత. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ యువతికి పోలీసులు రక్షణ నిలిచారు. పోలీసులు సహాయంతో మధులత సురక్షితంగా వైరా చేరింది.
కాగా చండీగఢ్ ఇండియా బిజినెస్ సంస్థకు చిక్కిన యువతి,యువకుల్లో అత్యధిక మోతాదులో గురుకులం లో చదివిన విద్యార్థినీ, విద్యార్థులే కావడం గమనార్హం. అందులోనూ వీరంతా నిరుపేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతీ యువకులే. మోసగాళ్లు సైతం వారినే టార్గెట్ చేస్తున్నట్లు బాధితులు తెలిపారు. కాగా చండీఘడ్ ,మొహాలి ప్రాంతంలో మోసగాళ్ల చేతిలో నలిగి పోతున్న యువతీ యువకులు ఐదు వేల మందికి పైగా ఉన్నారని బాధితులు తెలిపారు.