Job Mela: మహిళలకు గుడ్న్యూస్.. RNLIలో ఉద్యోగాల జాతర!
వరంగల్లోని రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ కంపెనీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. 50 లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఆగస్టు 20న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఉమారాణి తెలిపారు. ములుగు రోడ్డు ఐటీఐ ప్రాంగణంలో సెలక్షన్ ప్రక్రియ ఉంటుంది.