/rtv/media/media_files/2025/08/25/khammam-crime-2025-08-25-06-43-37.jpg)
Bhadradri Kothagudem crime
Crime: ఈ మధ్య వివాహ బంధాలకు విలువ లేకుండా పోతుంది. కట్నం కోసం కట్టుకున్న వారిని హత మార్చడం, హింసించడం వంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలాంటి మరో చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తూ.. కనీసం సరైన తిండి కూడా పెట్టకుండా.. చివరకు ఆమె అనారోగ్యంతో చనిపోయేలా చేసినట్లు తెలుస్తోంది.
రెండేళ్లుగా తల్లిదండ్రులు తమ కూతురి ముఖం చూపించలేదు! ఫోన్ చేసిన మాట్లాడనివ్వలేదు. ఆమెను చూడడానికి వెళ్లినా ఊర్లో లేదని ఏవేవో కారణాలు చెప్పేవారు. తీరా ఒకరోజు అల్లుడు ఫోన్ చేసి మీ అమ్మాయి మెట్ల పై నుంచి పడిపోయింది ఆస్పత్రిలో చేర్పించామని చెప్పాడు. దీంతో పరుగుపరుగున అక్కడికి వెళ్లిన తల్లిదండ్రులు తమ కూతురిని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. కళకళలాడుతూ ఎంతో చక్కగా కనిపించే తమ కూతురు గుర్తుపట్టలేని స్థితిలో కనిపించింది. డొక్కలు అంటుకుపోయి.. ఒక అస్థిపంజరం వలె విగతజీవిగా పడింది. కుమార్తెను ఆ పరిస్థితిలో చూసి తల్లిదండ్రులు అల్లాడిపోయారు. అల్లుడే తమ బిడ్డకు చావుకు కారణమని గుండెలు బాదుకున్నారు. తమ బిడ్డకు తిండి పెట్టకుండా హింసించి.. హత్య చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అదనపు కట్నం కోసం హింస
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వన్నాథంపురం గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న అనే మహిళకు అదే మండలానికి చెందిన పూల నరేశ్‌బాబుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్ళైన ఏడాదికి వీళ్ళకి ఒక పాప పుట్టింది. అప్పటి నుంచి సురేష్ బాబు ఆరేళ్ళ పాటు భార్య, పాపతో కలిసి అత్తారింట్లోనే ఉన్నాడు. ఆ తర్వాత భార్యాబిడ్డలతో కలిసి అశ్వారావుపేటకు వచ్చిన సురేష్ బాబు గత మూడేళ్ళుగా తన అక్కా భావాల ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం భార్య లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. మీ అమ్మాయి మెట్ల పై నుంచి పడిపోవడంతో గాయాలయ్యాయని, ఆస్పత్రిలో చేర్పించామని చెప్పాడు. రాజేమహేంద్రవరంలోని ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపాడు. దీంతో అత్తమామలు హుటాహుటిన ఆస్పత్రికి బయలుదేరి వచ్చారు. ఆస్పత్రిలో కూతురి శరీరంతా గాయాలతో ఉండడం చూసి అల్లాడిపోయారు. బాగా బక్కచిక్కిపోయి.. ఎముకలు గూడులా మారి విగతజీవిగా పడి ఉంది. కూతురిని ఆ పరిస్థితిలో చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
అయితే భర్త సురేష్, అత్త విజయలక్ష్మి, అక్కాబావలు దాసరి భూలక్ష్మీ, శ్రీనివాస్ రావు తమ కూతురిని అదనపు కట్నం కోసం తరచూ హింసించేవారిని ప్రసన్న పేరెంట్స్ వాపోయారు. ''ఆమెను గృహ నిర్బంధం చేసి కనీసం సరైన తిండి కూడా పెట్టకుండా హింసించి చంపేశారని'' ఆరోపించారు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు సురేష్ బాబు బావ శ్రీవాస్ రావు లక్ష్మీ ప్రసన్నకు లక్ష్మీప్రసన్నకు థైరాయిడ్, రక్తహీనత సమస్యలు ఉన్నాయని చెప్పాడు. అలాగే ఆమెను తల్లిదండ్రులకు చూపించలేదనడం నిజం కాదని అన్నాడు.
రూ.10 లక్షల నగదు, రూ.10 లక్షల బంగారం, మామిడితోట
ప్రసన్న తల్లిదండ్రులు వివాహ సమయంలో తమ కూతురికి రెండెకరాల మామిడితోట, అరెకరం పొలంతోపాటు, రూ.10 లక్షలు విలువ చేసే బంగారు , రూ. 10 లక్షల నగదును కట్నంగా ఇచ్చినట్లు తెలిపారు.
Also Read: TG Crime: కొంత గ్యాప్ అంతే.. అదే రిపీట్... రాయితో తల పగలకొట్టి.. భర్తను చంపిన భార్య...