/rtv/media/media_files/2025/09/06/ganpayya-2025-09-06-13-44-46.jpg)
ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కన్నుల పండువగా జరిగింది. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన గణనాథుడు కొద్దీసేపటి క్రితమే గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. హుస్సేన్ సాగర్‌లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఉన్న ప్రత్యేకమైన క్రేన్ నంబర్ 4 వద్ద నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి ముందు ఖైరతాబాద్ మహాగణనాథుడికి హారతి ఇచ్చిన వేద పండితులు కలశపూజ చేశారు. ఈ భారీ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి విజయవాడ నుంచి ప్రత్యేకంగా టస్కర్ అనే భారీ ట్రాలీని తెప్పించారు. శోభాయాత్ర సాఫీగా సాగేందుకు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
చంద్రగ్రహణం కారణంగా
వేలమంది భక్తుల జయజయధ్వానాల మధ్య నిమజ్జన ప్రక్రియ పూర్తి అయింది. భక్తులు గణేషుడిని భక్తిశ్రద్దలతో దండాలు పెడుతూ మళ్లీ రావయ్యా గణపయ్యా అంటూ వీడ్కొలు పలికారు. చంద్రగ్రహణం కారణంగా సాధారణంగా జరిగే అనంత చతుర్దశి రోజుకు బదులుగా ఒక రోజు ముందుగా నిమజ్జనం చేశారు. కాగా ఈ సారి ఖైరతాబాద్ గణనాథుడిని 69 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇది పూర్తిగా మట్టితో తయారు చేయబడింది. ఈ సంవత్సరం దాదాపు 50 లక్షలకు పైగా భక్తులు ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్నారని అంచనా.