రాష్ట్రంలో కొత్త పార్టీపై కవిత బిగ్ అప్‌డేట్.. KTR, హరీశ్ రావులపై సెటైర్లు

తెలంగాణ జాగృ‌తి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ గురించి అప్‌డేట్ ఇచ్చింది. మరో 3 నెలల్లో పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటిస్తానని హైదరాబాద్‌లో మీడియాతో కవిత మాట్లాడారు. బీసీల అంశంలో BRS పార్టీ ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆమె ఆరోపించారు.

New Update
kavitha

తెలంగాణ జాగృ‌తి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ గురించి అప్‌డేట్ ఇచ్చింది. మరో 3 నెలల్లో పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటిస్తానని హైదరాబాద్‌లో మీడియాతో కవిత మాట్లాడారు. బీసీల అంశంలో BRS పార్టీ ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆమె ఆరోపించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయాలో.. వద్దో.. బీసీలు ఆలోచించుకోవాలన్నారు. పెద్ద నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీని గాలికి వదిలేశారా? అని ప్రశ్నించారు. తమ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి మంచి ముహూర్తం కోసం చూస్తున్నామని.. ఏర్పాటు ప్రక్రియ మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశముందని ఈ సందర్భంగా కవిత తెలిపారు.

‘‘మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రచారం అంత యాక్టివ్‌గా లేదు. ఆ పార్టీ నేతలెవరూ క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా లేరు. కృష్ణార్జునులు రాష్ట్రమంతా ఎందుకు పర్యటించడం లేదు? అలా ప్రచారం చేయడం లేదంటే.. వారు రాష్ట్రస్థాయి నేతలు కారా?. బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్‌ తన విధానాన్ని స్పష్టంగా చెప్పలేదు. ఆ సామాజిక వర్గానికి వారు అనుకూలమా?, లేదా? అనేది వెల్లడించాలి. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్‌ వేసిన మాధవరెడ్డికి ఆ పార్టీ టికెట్‌ ఎలా కేటాయిస్తుంది? బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలుచేయాలి. సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించాలి. సీఎం రేవంత్‌ ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదు. నేను అసంబద్ధంగా మాట్లాడితే ప్రజలే ప్రశ్నిస్తారు. ఎవరు సమాధానాలు దాటవేస్తున్నారో వారు గమనిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు’’ అని కవిత అన్నారు. 

Advertisment
తాజా కథనాలు