/rtv/media/media_files/2025/03/09/yjaQ2KprSAy0Waub6KZp.jpg)
DK Shiva Kumar Madhu Yashki
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కుమార్తె కీర్తి, ప్రముఖ వ్యాపారవేత్త మహేష్ రెడ్డి గారి కుమారుడు నితేష్ వివాహ రిసెప్షన్ నిన్న హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగింది. ఈ వేడుకకు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరుకావడం ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత పరిచయాల కారణంగానే ఆయన ఈ వివాహానికి హాజరయ్యారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ వేడుకకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, కర్ణాటక ఎమ్మెల్యే ఎన్. ఏ.హరీష్ తదితరులు సైతం హాజరయ్యారు.