Rajnath singh: ఆయనొక్కడే తోపా..! కేసీఆర్పై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కరే ఉద్యమించలేదని, ఆయనొక్కడే హీరో కాదని యావత్ తెలంగాణ సమాజం, బీజేపీ కూడా పోరాటం చేసిందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. రాణి రుద్రమదేవి, కుమురం భీమ్ వంటి ఎంతోమంది వీరులను కన్న గడ్డ తెలంగాణ అన్నారు. కేసీఆర్ కుటుంబం.. ఆయన పరివారం మాత్రమే రాష్ట్రంలో బాగుపడ్డారని, ప్రజలు బాగుపడలేదని తెలిపారు.