ప్రియుడితో సన్నిహితం.. బాలికను బెదిరించి అత్యాచారం
ఓ బాలిక తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్నప్పుడు తన ప్రియుడి స్నేహితులు రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీశారు. వాటిని చూపి బెదిరించి పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మరో ముగ్గురు స్నేహితులు ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు షీ-టీమ్‌ను ఆశ్రయించింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది.