బొగ్గు గనుల పరిసరాల్లో మందు​ పార్టీలు బంద్

భూ భాగంలో తరిగిపోయే ఇంధన వనరుల్లో నేల బొగ్గు ఒకటని మనకు తెలుసు. ఇది శిలాజ ఇంధనం. ఈ శిలాజ ఇంధనాలు జీవుల నుండి యేర్పడ్డాయి. సుమారు 300 మిలియన్ల ఏళ్ల పూర్వం భూభాగం పైనున్న తేమ నేలల్లోని మహా వృక్షాలు భూగర్భంలో కూరుకుపోయి నేలబొగ్గుగా మారాయి.

New Update
బొగ్గు గనుల పరిసరాల్లో మందు​ పార్టీలు బంద్

Bandh of drug parties in the vicinity of coal mines

క్రమశిక్షణ చర్యలు

సింగరేణి బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్ల​ఆవరణల్లో మందు పార్టీలు చేసుకోవద్దంటూ శ్రీరాంపూర్​ ఏరియా సింగరేణి యాజమాన్యం సర్క్యూలర్​ జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్‌లతో సహా కొందరు ఉద్యోగులు మందు పార్టీలు చేసుకుంటున్నారని ఇది దుష్ప్రవర్తన కిందకు వస్తుందని పేర్కొంది. గనులు, డిపార్ట్​మెంట్ల పరిసరాల్లో మందు పార్టీలు చేసుకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సర్క్యూలర్​ జారీ

బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లపై ఉన్న మైసమ్మ తల్లి ఆలయంలో కోళ్లు, మేకలు కోసి, ఉద్యోగులు సామూహిక విందు చేసుకోవడం, మందు తాగడం ఆనవాయితీగా వస్తుందని టీబీజీకేఎస్​ కేంద్ర కమిటీ వైస్​ ప్రెసిడెంట్​ డీకొండ అన్నయ్య, శ్రీరాంపూర్​ ఏరియా బీఎంఎస్ సెక్రటరీ నాతాడి శ్రీధర్​రెడ్డి అన్నారు. పూజా కార్యక్రమాలను నిర్వహించవద్దని సింగరేణి యాజమాన్యం సర్క్యూలర్​ చేయడం వారి మనోభావాలను దెబ్బతీయడమేని, వెంటనే సర్క్యూలర్​ను ఉపసహంరించుకోవాలని డిమాండ్​ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు