/rtv/media/media_files/2026/02/15/karimnagar-corporation-2026-02-15-16-38-29.jpg)
karimnagar corporation
BIG BREAKING: ఉత్కంఠ రేపుతున్న కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠం బీజేపీకి దక్కే అవకాశం కనిపిస్తోంది, ఆ పీఠాన్ని ఎలాగైన దక్కించుకోవాలని కాంగ్రెస్ పన్నిన వ్యూహనికి బీఆర్‌ఎస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఎవరికి మద్ధతు ఇవ్వకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయించింది. దీంతో కార్పొరేషన్ లో ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి సభ్యుల సంఖ్య69 కి చేరింది. ఇందులో ఇండిపెండెన్స్ తో కలిసి 34 మంది బిజెపి అభ్యర్థులు ఉన్నారు. 9 మంది బీఆర్‌ఎస్ సభ్యులు తటస్థంగా ఉండనుండటంతో 60 లో సగం కంటే ఒకటి ఎక్కువ 31 ఓట్లు వస్తే సరిపోతుంది. ఇప్పటికే బీజేపీకి 30 మంది సభ్యులు ఉండగా ఎక్స్ ఆఫీషీయో సభ్యుడిగా బండి సంజయ్ ఓటుతో 31 మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకోనుంది. దీంతో బీజేపీ గెలుపు సునాయాసంగా కానుంది.
కాగా బీజేపీని నిలువరించడం కోసం బీఆర్‌ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్లతో కలిసి కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయడం మంచిది కాదన్నా టిఆర్ఎస్ అధినేత నిర్ణయంతో ఉత్కంఠకు తెరపడినట్లయింది. రాష్ర్టంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ మేయర్ మాత్రం కాంగ్రెస్ కు మద్ధతు ఇవ్వడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతాయని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సూచించడంతో బీఆర్‌ఎస్ తటస్థంగా ఉండాలని నిర్ణయించింది.
కరీంనగర్ కార్పొరేషన్లో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడిన విషయం తెలిసిందే. మేయర్ సీటు కైవసం చేసుకుంటామని ముందే ప్రకటించిన బీజేపీ స్వతంత్రులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా విజయం సాధించవచ్చని భావించింది. అయితే బీజేపీ క్యాంప్ నుండి అభ్యర్ధులను లాగి కాంగ్రెస్ ట్విస్ట్ ఇచ్చింది. దీంతో మేయర్ పీఠం కాంగ్రెస్ కే అన్న ప్రచారం సాగుతున్న వేళ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీఆర్‌ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వకుండా ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.. దీంతో బీజేపీకి మేయర్ ఎన్నికకు మార్గం సుగమమైంది.
Follow Us