కాళేశ్వరంపై విచారణ.. ఇంజనీర్ల సమాధానాలకు కంగుతిన్న పీసీ కమిషన్

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లీకేజిలపై ఇంజనీర్లు చెప్పిన సమాధానాలకు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ కంగుతిన్నది. కమిషన్ అడిగిన ప్రశ్నలకు 'తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా'నంటూ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీదేవి చెప్పడంతో షాక్ అయ్యారు. 

New Update
mdg

Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల అవకతవకలపై చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీదేవిని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారించింది. శ్రీదేవి దాఖలు చేసిన అఫిడవిట్‌ పై కట్టుబడి ఉన్నారా? అంటూ ఆమెను ప్రశ్నించింది. అంతేకాదు అఫిడవిట్ లో శ్రీదేవి పేర్కొన్న పలు అంశాలపై నిలదీయగా ఆమె ఆసక్తికర సమాధానాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. పీసీ కమీషన్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయగా.. ఒకసారి పరీక్షలు చేయలేదని మరోసారి చేశామని సమాధానం చెప్పింది శ్రీదేవి. ‘స్టేట్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ సీఈగా మీ బాధ్యతలేంటి?’ అనే ప్రశ్నలకు ఆన్సర్ చేయలేక తడబడింది. అంతేకాదు ఐఎస్ కోడ్‌ ఏం చెబుతోంది? అది అమలు జరిగిందా? అని అడిగితే.. దీనికి కూడా ఆమె జవాబు చెప్పలేకపోయింది.

ఏమీ తెలియదంటూ తడబాటు..

ఈ క్రమంలో శ్రీదేవిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్.. కాళేశ్వరం ప్రాజెక్టుకు వరదలు ఎప్పుడొచ్చాయని అడిగింది. దీంతో తనకు తెలియదంటూ శ్రీదేవి ఆన్సర్ చేయగా.. బ్యారేజీలపై 2020లో త్రీడీ మోడల్‌ స్టడీస్‌ జరిగాయని తప్పుడు సమాధానం చెప్పింది. అలాగే ‘తెలంగాణ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ 2023లో మోడల్‌ స్టడీస్‌ చేసి, నివేదిక ఇచ్చిన విషయం తెలుసా అని అడగగా.. తెలియదంటూ దాటవేయడంతో కమిషన్‌ షాక్ అయింది. విచారణలో మొత్తంగా తెలియదు, గుర్తులేదు, మరిచిపోయా అంటూ శ్రీదేవి చెప్పడంతో కమిషన్ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. 

జవాబు చెప్పలేక నీళ్లు నమిలిన ప్రమీల..

మరోవైపు ఎస్‌డీఎస్ వో చీఫ్‌ ఇంజనీర్‌ ప్రమీలను కూడా కమిషన్‌ విచారించింది. ఈ క్రమంలో ప్రాజెక్టు అథారిటీదేనని గుర్తుచేసింది ప్రమీల. బ్యారేజీల రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత డ్యామ్‌ ఓనర్‌దే అన్నారు. దీంతో డ్యామ్‌సేఫ్టీ చట్టం అమల్లోకి వచ్చాకా అందులోని క్లాజ్‌-46 ప్రకారం కాళేశ్వరం బ్యారేజీల రక్షణకు తీసుకున్న చర్యల గురించి కమిషన్‌ ప్రశ్నించింది. గేట్ల మ్యానువల్‌, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ప్రోటోకాల్స్‌ను అమలు చేశారనే అంశాపై జవాబు చెప్పలేక ప్రమీల నీళ్లు నమిలారు. దీంతో  వారి పేర్లు బయపెట్టొదు కానీ.. ఒక ఇంజనీర్‌గా బదులివ్వాలని కోరింది. ఈ క్రమంలో డ్యామ్‌ సేఫ్టీ చట్టం ప్రకారం వానాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీలను ఎలాంటి తనిఖీ చేయలేదని, నివేదిక కూడా ఇవ్వలేదని ప్రమీల బయటపెట్టింది. 

నమూనా అధ్యయనాలు జరగకముందే నిర్మాణం..

ఇక ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(ఈఈ) విజయలక్ష్మిని కూడా కమిషన్‌ ప్రశ్నించింది. వానాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీలను పరిశీలించి, నివేదికలు ఇవ్వాల్సి ఉన్నా.. తాము ఆ పని చేయలేదని విజయలక్ష్మీ తెలిపింది. 2023 అక్టోబరులో బ్యారేజీ కుంగిన అంశాన్ని వివరిస్తూ.. ఏబీ పాండ్యా నేతృత్వంలోని డ్యామ్‌ సేఫ్టీ రివ్యూ ప్యానల్‌ బ్యారేజీని పరిశీలించిందని, కుంగుబాటుకు కారణాలపై స్వతంత్ర కమిటీ వేయాలని ఏబీ పాండ్యా నివేదిక ఇచ్చారని విజయలక్ష్మి తెలిపారు. బ్యారేజీల నిర్మాణం జరగడానికి ముందు పూర్తిస్థాయిలో నమూనా అధ్యయనాలు జరగకముందే నిర్మాణం ప్రారంభమైందని టీఎస్ఈఆర్‌ఎల్‌కు చెందిన రీసెర్చ్‌ ఇంజనీర్లు కమిషన్‌కు చెప్పారు. నీటిని నిల్వ చేయడమే మేడిగడ్డ కుంగుబాటుకు కారణం అన్నారు. వరదలప్పుడు గేట్లు ఎత్తకపోవడంతో బ్యారేజీపై నీటి ఒత్తిడి పెరిగి ఇసుక పునాదుల నుంచి జారిపోయిందని వివరించారు. మరో 8 మంది ఇంజనీర్లను కమిషన్‌ శనివారం విచారించనుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు