/rtv/media/media_files/2025/11/11/jubilee-hills-2025-11-11-06-49-45.jpg)
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు కేవలం 9.2 శాతం పోలింగ్ నమోదైంది. ప్రధాన పార్టీలు తీవ్ర స్థాయిలో ప్రచారం చేశాయి. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం డోర్ టు డోర్ ప్రచారం చేశారు. ఎన్నికల కమిషన్ కూడా ఓటింగ్ శాతం పెంచడానికి హాలీడే కూడా ఇచ్చింది. అయనప్పటికీ యూత్ ఓట్ వేయడానికి ముందుకు రాకపోవడం నిజంగా సిగ్గుచేటని చెప్పాలి. నాలుగు లక్షల ఓటర్లు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నారో అని నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన పోలింగ్ వైపు పెద్దగా ఓటర్లు ఆసక్తి చూపించకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
మరోవైపు బోరబండలో బీఆర్ఎస్ కార్యకర్త విజయ్‌పై కాంగ్రెస్ కార్పొరేటర్ దాడి చేశారని ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. కాంగ్రెస్ దాడులకు భయపడి ఓటర్లు రావడం లేదన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని సునీత ఆరోపించారు. సునీత చేసిన ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి.
జూబ్లీహిల్స్ ఓటర్లంతా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ . 2023 అసెంబ్లీ పోలింగ్ తో పోలిస్తే 10 నుంచి 15 శాతం పోలింగ్ పెరిగే అవకాశం ఉందన్నారు. 45 నిమిషాల్లోనే ఓ బూత్ లో 60 నుంచి 70 ఓట్లు పోల్ అయ్యాయని అన్నారు. ఓటు వేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారని, యువత భవిష్యత్తు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఓటేయాలని నవీన్ యాదవ్ పిలుపునిచ్చారు.
Follow Us