/rtv/media/media_files/2025/11/11/jubilee-hills-2025-11-11-06-49-45.jpg)
జాబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అంతా సిద్ధమైంది. మరికాసేపట్లో ఓటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై డ్రోన్లతో సహా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నిక మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీకి అగ్నిపరీక్షగా నిలిచింది.
ఓటింగ్ లో మాత్రం వెరీ లేజీ
జాబ్లీహిల్స్ పేరుకే రిచ్ కానీ ఓటింగ్ లో మాత్రం వెరీ లేజీ అని చెప్పాలి. ఇక్కడ దాదాపుగా 4 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా.. సగం మంది కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. 2023లో 47.58 శాతం, 2018లో 47.2 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ రోజు గవర్నమెంట్ హాలిడే ప్రకటిస్తున్న ఓటు వేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు.. గత ఎన్నికల్లో ముఖ్యంగా యూసుఫ్‌గూడ, బోరబండ, రెహమత్‌నగర్ వంటి ప్రాంతాల్లో ఓటింగ్ శాతం 45% కంటే తక్కువగా నమోదైంది.
తాగునీరు, మురుగునీటి పారుదల, రోడ్లు వంటి ప్రాథమిక పౌర సమస్యలు సరిగా పరిష్కారం కాకపోవడంతో ప్రజలు స్థానిక నాయకులపై నిరసనగా ఓటు వేయడం మానేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ సారి ఉప ఎన్నిక కావడంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాగా ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది.ఉప ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే శక్తిని కలిగి ఉండటంతో, ఇక్కడ ఓటర్లు ఇచ్చే తీర్పు కోసం రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Follow Us