Maoist : మావోయిస్టుల్లారా మారండి.. జనంలోకి రండి.. రవిప్రకాష్ సంచలన ట్వీట్!

డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో, మావోయిస్టులు పాత తరహా గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించడం విప్లవంలా కనిపించినా, అది వారి అంతానికి దారితీసే ఆత్మహత్యేనని రవిప్రకాష్ తన ట్వీట్ లో  చెప్పారు.

New Update
ravi prakash

మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.ఆపరేషన్ కగార్ దెబ్బకు చాలామంది నేలకొరిగారు. మిగిలిన మావోయిస్టు అగ్రనేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇప్పుడు లొంగిపోతున్నారు. ఇటీవల మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులలో ఒకరైన మల్లోజుల వేణుగోపాల్ రావుతన 44 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని వీడి మహారాష్ట్ర పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 60 మంది సాయుధ కేడర్ కూడా లొంగిపోవడం మావోయిస్టలకు కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఇక మరో మావోయిస్టు అగ్రనేత తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, హోంమంత్రి విజయ్ శర్మ సమక్షంలో లొంగిపోయారు. 

అంతానికి దారితీసే ఆత్మహత్యే

ఈ క్రమంలో రవిప్రకాష్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. డ్రోన్ల వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో, మావోయిస్టులు పాత తరహా గెరిల్లా యుద్ధాన్ని కొనసాగించడం విప్లవంలా కనిపించినా, అది వారి అంతానికి దారితీసే ఆత్మహత్యేనని రవిప్రకాష్ తన ట్వీట్ లో  చెప్పారు. మావోయిస్టులు తమ పాత సిద్ధాంతాలను విడిచిపెట్టకపోతే, వారు త్వరలోనే అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

వందేళ్ల నాటి వ్యూహాలు, అడవి చాటున నక్సలైట్ల మనుగడ సాగించడం అసాధ్యమన్నారు రవిప్రకాష్. వారి పోరాటం ఇక కొనసాగలేదన్నారు. మావోయిస్టులు తమ వ్యూహాలను పూర్తిగా మార్చుకొని అభయ అరణ్యాన్ని వీడి  జనఅరణ్యంలోకి అడుగు పెట్టాలని సూచించారు, వారిని విప్లవకారులుగా కాకుండా, శిలాజాలుగా మారడానికి వేచి చూస్తున్న అవశేషాలుగా మాత్రమే చూడాల్సి ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఆయన మావోయిస్టులతో ఇంటర్వ్యూ చేసిన ఫొటోలను రవిప్రకాష్ ఈ ట్వీట్ లో పంచుకున్నారు. 

Advertisment
తాజా కథనాలు