Jani Master : పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ!

లైగింక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు నిన్న గోవాలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నేడు ఆయనను హైదరాబాద్‌ కి తీసుకురానున్నారు. నేడు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు.

author-image
By Bhavana
New Update
Jani Master

Jani Master: అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ పై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులో ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీ బాషాను సైబరాబాద్‌ పోలీసులు గోవాలో అరెస్ట్‌ చేశారు. రెండ్రోజులుగా పరారీలో ఉన్న ఆయన గోవాలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. 

స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్ పై జానీ మాస్టర్‌ ని హైదరాబాద్‌ తీసుకుని వస్తున్నారు. ఈ నెల 15న జానీ మాస్టర్‌ పై కేసు నమోదు అవ్వగా..4 రోజుల తరువాత జానీ మాస్టర్‌ ని పోలీసులు కనుగొన్నారు. 

చాలా సార్లు అత్యాచారం...

తనను బెదిరించి చాలా సార్లు అత్యాచారం చేశాడని..ఈ విషయం గురించి బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని భయపెట్టినట్లు జానీ మాస్టర్‌ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు కేసును నార్సింగి స్టేషన్‌కు బదిలీ చేశారు. బాధితురాలి వాంగ్మూలం సేకరించి ఆమె మైనర్‌ గా ఉన్నప్పటి నుంచి కూడా ఆమె పై లైంగిక దాడి జరుగుతున్నట్లు కన్ఫార్మ్‌ చేసుకున్న పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ లో పోక్స్‌ సెక్షన్‌ కూడా యాడ్‌ చేశారు. 

జానీ మాస్టర్‌ పరారైనట్లు...

ఈ క్రమంలో జానీ మాస్టర్‌ అజ్ఙాతంలోకి వెళ్లగా నార్సింగి పోలీసులు ఫోన్‌ ద్వారా జానీ మాస్టర్‌ ని సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు. మణికొండలోని ఆయన ఇంటికి వెళ్లగా జానీ మాస్టర్‌ చెన్నై వెళ్లినట్లు తెలిపింది. దీంతో జానీ మాస్టర్‌ పరారైనట్లు నిర్థారించుకున్న పోలీసులు ఆయన ఆచూకీ కోసం గాలించగా గోవాలో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలతో కనిపెట్టారు. పెద్ద హోటళ్లలో ఉంటే ఆచూకీ కనిపెట్టడం సులువు అవుతుందని భావించిన జానీ మాస్టర్‌...ఓ చిన్న హోటల్‌ లో దాక్కున్నాడు.

పక్కా ఆధారాలు సేకరించిన రాజేంద్ర నగర్‌ ఎస్‌వోటీ పోలీసుల బృందం బుధవారం గోవాకి వెళ్లి గురువారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది. శుక్రవారం ఉప్పర్‌ పల్లిలోని కోర్టులో జానీ మాస్టర్‌ ని హాజరుపరిచే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టులో ఈ కేసు గురించి ఏం తీర్పు వెలువడుతుంది అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు