ఇడ్లీలో కనిపించిన జెర్రీ.. దారమని నోట్లో వేసుకున్న ఓనర్.. చివరికీ

జగిత్యాల జిల్లా కేంద్రంలోని గణేష్ భవన్‌ అనే హోటల్‌లో ఇడ్లిలోకి జెర్రీ వచ్చింది. దీంతో కస్టమర్ హోటల్ ఓనర్‌తో వాగ్వాదానికి దిగాడు.అది దారమేనని నోట్లో వేసుకున్న ఓనర్‌.. జెర్రీ అని తేలడంతో ఉమ్మేశాడు.దీంతో హోటల్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు.

New Update

బయటి ఆహారం తినేటప్పుడు అందులో బల్లులు, పురుగులు లాంటివి కనిపించి కస్టమర్లకు షాకిచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గణేష్ భవన్‌ అనే హోటల్‌లో ఇడ్లిలోకి జెర్రీ వచ్చింది. ఆ హోటల్‌కి వచ్చిన కస్టమర్ పిల్లలకు ఇడ్లీ తినిపించే క్రమంలో ఒక్కసారిగా అందులో జెర్రీ కనిపించింది. దీంతో ఆ కస్టమర్‌ ఓనర్‌తో వాగ్వాదానికి దిగాడు. మరోవైపు అది జెర్రీ కాదని దారమని కస్టమర్‌తో ఓనర్ వాదించాడు.

Also Read: బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. నెక్స్ట్ టార్గెట్ ఆ స్టార్ హీరోనే!

 అది దారమేనని నోట్లో వేసుకున్న ఓనర్‌.. జెర్రీ అని తేలడంతో దాన్ని ఉమ్మేశాడు. దీంతో వెంటనే ఆ ఇడ్లీలను పారేసేందుకు హోటల్ సిబ్బంది యత్నించారు. కానీ ఆ కస్టమర్‌ వాళ్లని అడ్డుకొని ఇడ్లీలతో రోడ్డుపై బైఠాయించాడు. హోటల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.  

Advertisment
తాజా కథనాలు