BIG BREAKING : మున్సిపల్ ఎన్నికల్లో సంచలనం.. బీఆర్ఎస్ పొత్తుతో జనసేన బోణీ!

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకుని మున్సిపల్ పీఠంపై పట్టు సాధించింది.

New Update
janasena

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకుని మున్సిపల్ పీఠంపై పట్టు సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన జనసేన పార్టీ ఒక వార్డులో విజయం సాధించి మున్సిపాలిటీలో తన ఖాతాను తెరిచింది. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న మున్సిపల్ పోరులో జనసేన పార్టీ ఇక్కడ బోణీ కొట్టడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. బీఆర్ఎస్ 5 వార్డులను గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. మొత్తానికి 9 వార్డులను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ నేరేడుచర్ల మున్సిపాలిటీని తన సొంతం చేసుకోగా, ప్రతిపక్ష స్థానంలో బీఆర్ఎస్-జనసేన కూటమి నిలిచింది. గెలిచిన అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి పట్టణంలో సంబరాలు జరుపుకుంటున్నారు.

Advertisment
తాజా కథనాలు