వామ్మో పిల్లలూ జాగ్రత్త.. బిస్కెట్‌లో ఐరన్ వైర్.. వీడియో చూశారా?

బిస్కెట్లలో ఇనుప తీగలు ప్రత్యక్షమైన ఘటన కామారెడ్డిలో కలకలం రేపుతుంది. దేవునిపల్లిలో హనుమాన్ రెడ్డి తన పిల్లల కోసం బార్‌బన్ బిస్కెట్లు కొన్నాడు. వారు తింటున్న సమయంలో అందులో సన్నని ఇనుప తీగ కనిపించింది. దీంతో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Iron Wire in Biscuit
New Update

చిన్న పిల్లలకు బిస్కెట్, చాక్లెట్స్ వంటి తినుబండారాలంటే చాలా ఇష్టం. తెలియనివారు వాటిని ఇచ్చినా కాదనకుండా తీసుకుంటారు. వాటిని తినకూడదని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినిపించుకోరు. అయితే మరికొందరు బిస్కెట్లను చాయ్‌తో పాటు తింటుంటారు. ఒక్కపూట మాత్రమే కాకుండా రోజులో చాలా సార్లు ఇలా చేస్తుంటారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్‌ పేద పిల్లలకు విద్యను దూరం చేసింది.. కేసీఆర్‌పై రేవంత్ ఫైర్

అయితే ఈ మధ్య కొన్ని బిస్కెట్, చాక్‌లెట్ కంపెనీలు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని చాక్‌లెట్, బిస్కెట్‌లలో చిన్న చిన్న పురుగులు రావడం చూశాం. అందుకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు కూడా అలాంటి సంఘటనే జరిగింది. అయితే ఈ సారి పురుగులు కాకుండా వైర్లు వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. 

బిస్కెట్‌లో ఐరన్ వైర్

తెలంగాణ, కామారెడ్డి జిల్లాలోని దేవునిపల్లిలో బోర్బన్ బిస్కెట్లో ఐరన్ వైర్ కనిపించింది. దీంతో వెంటనే సదరు వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ మేరకు.. తన పిల్లల కోసం బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చానని.. అయితే వారు భోజనం చేస్తున్న క్రమంలో ఒక బిస్కెట్ నుంచి ఐరన్ వైర్ వచ్చిందని తెలిపాడు. 

దేవునిపల్లి గ్రామంలోని హనుమంతరెడ్డి అనే వ్యక్తి బోర్బన్ బిస్కెట్ కొన్నాడు. పిల్లలు బిస్కెట్లు తింటుండగా.. ఒక బిస్కెట్‌లో సన్నని ఇనుప తీగ ఉండటాన్ని గమనించాడు. ఈ మేరకు ఒక సందేశాన్ని పంపాడు. బిస్కెట్లు, చాక్లెట్లు వంటి ఉత్పత్తులను పిల్లలు వినియోగిస్తుంటారు.

ఇది కూడా చదవండి: విషాదం.. భర్త, ఇద్దరు కుమారుల మృతి.. ‘మీరు లేని జీవితం నాకొద్దు’

 అయితే వీటిలో ఆహార భద్రత గురించి పట్టించుకోకపోవడం తీవ్రమైన విషయంగా భావించాలని కోరాడు. ప్రస్తుతం ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీలోనే ఇలాంటి ఘోరాలేంటని కామెంట్ చేస్తున్నారు.

#viral-news #latest-viral-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe