Hyderabad: బాచుపల్లిలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య..!

హైదరాబాద్‌ లోని బాచుపల్లిలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దసరా సెలవుల అనంతరం కాలేజీకి వచ్చిన విద్యార్థిని ఈ దారుణానికి పాల్పడింది.

యువకుడి ఆత్మహత్యాయత్నం.. పోలీసుల వేధింపులే కారణమా?
New Update

Hyderabad: హైదరాబాద్‌ లోని బాచుపల్లిలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు విద్యార్థిని స్పృహతప్పినట్లు సమాచారం అందించారు. తల్లిదండ్రులు కాలేజీకి చేరుకున్నాక వారు చనిపోయినట్లు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినిని సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన అనూషగా  గుర్తించారు.

Also Read: విశ్వవిజేతులుగా కివీస్.. మొదటిసారి టైటిల్ సొంతం

అనూష దసరా సెలవులకు ఇంటికి వెళ్లి, తిరిగి మళ్లీ నిన్ననే ఆదివారం కాలేజీ హాస్టల్‌కు వచ్చింది. నిన్న తల్లిదండ్రులు హాస్టల్‌లో వదిలేసి వెళ్లిన కొద్దిసేపటికే ఆమె స్పృహతప్పి పడిపోయిందంటూ హాస్టల్‌ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కానీ వారు అప్పటికి హైదరాబాద్ కూడా దాటలేదు.

Also Read: మణికంఠ AV ఎందుకు ప్లే చేయలేదు..? కారణం ఇదేనా

తల్లిదండ్రులు వెంటనే కాలేజీకి తిరిగి రాగా... విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు కాలేజీకి తిరిగి చేరుకునే లోపే కాలేజీ సిబ్బంది, బాచుపల్లి పోలీసులు అనూష మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు మొదలు పెట్టారు.

ప్రియుడితో వెళ్లి..బ్రెయిన్ డెడ్ తో మృతి!

తెనాలిలో మరో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సహానా అనే యువతిని రౌడీ షీటర్ నవీన్ శనివారం తన పుట్టినరోజు వేడుక చేసుకునేందుకు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అలా తీసుకెళ్లిన కొన్ని గంటలకే  అపస్మారక స్థితిలో ఉన్న సహానాను తీసుకువచ్చి తెనాలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించాడు.

Also Read: రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. కాల్పుల్లో డాక్టర్ సహా ఆరుగురు మృతి

ఉదయం డ్యూటీకి వెళ్లిన తమ కుమార్తెకి ఏమైందోనన్న ఆందోళనతో తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. వారికి వైద్యులు బ్రెయిన్ డెడ్‌ అయ్యిందని చెప్పారు. అయితే  సహానాకి బ్రెన్ డెడ్ ఎందుకు అయ్యిందో తెలియలేదు. దీంతో ఆమెకు మెరుగైన వైద్య సేవల కోసం మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ కూడా వైద్యులు యువతి బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పడంతో ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read:  ప్రియురాలిని చూసి సృహ తప్పిన ప్రియుడు.. తర్వాత ఏమైందంటే?

కాగా నవీన్ నడుపుతున్న కారుకి అడ్డుగా మరో వాహనం రావడంతో బ్రేకులు వేయడంతో ముందుసీట్లో కూర్చున్న యువతి తలకి గాయం అయినట్లు అతడు వెల్లడించినట్లు తెలుస్తోంది.  గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో బాధితురాలు కన్నుమూసింది. దీనితో నవీన్ అనే యువకునిపై పోలీసు కేసు నమోదు చేవారు. పోలీసులు నిందితుడు నవీన్ పై వల్లభాపురంలో రౌడీషీట్ ఉన్నట్లు తెలుసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe