Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ కీలక ఫైల్స్ మిస్సింగ్! TG: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక ఫైల్స్ మిస్ అయ్యాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలను వెల్లడించే సాక్ష్యాధారాలను నీటిపారుదల శాఖ అధికారులు ధ్వంసం చేశారని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ తెలిపారు. By V.J Reddy 28 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి Kaleshwaram Files : కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన కీలక ఫైల్స్ మాయమవడం కలకలం రేపింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ జరుపుతున్న జ్యుడీషియల్ కమిషన్ విచారణ తుది దశకు వచ్చినట్లు చెప్పారు. కాగా ఇదే సమయంలో ప్రాజెక్ట్ కు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ మిస్ అవ్వడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకంగా పని చేసిన అధికారులను విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ! ఫైల్స్ ధ్వంసం... కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యానికి గల కారణాలను వెల్లడించే సాక్ష్యాధారాలను నీటిపారుదల శాఖ అధికారులు ధ్వంసం చేశారని వెదిరె శ్రీరామ్ కమిషన్ ఎదుట చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ నివేదిక సమర్పించకపోవడానికి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారుల తీరే ప్రధాన కారణం అని అన్నారు. దీనిపై కమిషన్ అధికారులు సీరియస్ అయ్యారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని నీటిపారుదల శాఖ అధికారులను నిలదీసింది. ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రి పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు! దీని వెనక ఉంది ఎవరు?.. కాగా మేడిగడ్డ కుంగిపోవడంపై విచారణ జరుగుతున్న సమయంలో మెయింటెనెన్స్ కు సంబంధించిన రిజిస్టర్లు మాయం అవ్వడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. ఈ ఫైల్స్ మాయం కావడం వెనుక ఒక మాజీ మంత్రి హస్తం ఉందనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది. ఇంతకు ఆ మాజీ మంత్రి ఎవరు అనే దానిపై నెటిజన్లు ఇంటర్నెట్ లో వెతుకులాట ప్రారంభించారట. కాగా ఇప్పటికే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. విచారణకు హాజరైన అధికారులు అంత గత సీఎం చెప్పినట్టే చేశామని జ్యుడీషియల్ కమిషన్ ఎదుట సమాధానాలు చెప్పి కేసీఆర్ పై నెట్టేసినట్లు సమాచారం. కేసీఆర్ తో పాటు ఆ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు పేరు కూడా అధికారులు కమిషన్ ముందు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఏ క్షణమైన కేసీఆర్ ను అదుపులోకి తీసుకుంటారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే మాయమైన ఫైల్స్ పై కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: యువతి ప్రాణం తీసిన పల్లీలు.. అసలేమైందంటే? ఇది కూడా చదవండి: భారత్‌కు చిక్కిన లష్కరే తోయిబా ఉగ్రవాది.. ఏం చేశాడంటే #files-missing #judicial-commission #kaleshwaram-project మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి