HYDRAA: చెరువును ఇలా చేస్తారా?: వారికి హైడ్రా కమిషనర్ సీరియస్ వార్నింగ్!

అభివృద్ధి ప‌నుల పేరిట నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ముష్కిన్ చెరువులో మ‌ట్టి పోయ‌డంపై హైడ్రా క‌మిష‌న‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంట‌నే మ‌ట్టిని తొల‌గించాలని.. లేని ప‌క్షంలో చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

New Update
HYDRAA

రంగారెడ్డి జిల్లా మ‌ణికొండ మున్సిపాలిటీలోని ముష్కిన్‌ చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో వేసిన మ‌ట్టిని వెంట‌నే తొల‌గించాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశించారు. ఆగ‌స్టు నెలాఖ‌రుకు చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో వేసిన మ‌ట్టితో పాటు.. పై భాగంలో వేసిన బండ్‌ను తొల‌గించాల‌న్నారు. లేని ప‌క్షంలో బాధ్యుల‌పై క్రిమిన‌ల్ కేసులు పెడ‌తామ‌ని హెచ్చ‌రించారు. అభివృద్ధి పేరిట చెరువు ఎఫ్‌టీఎల్‌లో బండ్ నిర్మించి.. పై భాగాన్ని చెరువు నుంచి బండ్ ద్వారా వేరు చేస్తున్నార‌ని స్థానికుల ఫిర్యాదు చేశారు. దీనిపై హైడ్రా శుక్ర‌వారం హైడ్రా కార్యాల‌యంలో విచార‌ణ చేప‌ట్టారు. సీఎస్ఆర్ నిధుల కింద చెరువును అభివృద్ధి చేస్తున్న త‌త్వ‌ రియ‌ల్ ఎస్టేట్ సంస్థతో పాటు ఆ ప‌నులు చేప‌ట్టిన ద్ర‌వాన్ష్‌ అనే ఎన్‌జీవో సంస్థ ప్ర‌తినిధులు కూడా ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. 

నిబంధనలు పాటించరా?

చెరువు విస్తీర్ణం మొత్తం 50 ఎక‌రాల వ‌ర‌కూ ఉండ‌గా.. చెరువు చుట్టూ ఎగువ భాగంలో కూడా బండ్ నిర్మించ‌డంతో కేవ‌లం 12 ఎక‌రాల‌కు ప‌రిమితం చేసిన‌ట్టు అవుతోంద‌ని నివాసితులు, ముష్కి చెరువు ప‌రిర‌క్ష‌ణ సమితి ప్ర‌తినిధులు హైడ్రా ముందు వాపోయారు. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న త‌ర్వాత అభివృద్ధి ప‌నుల పేరిట నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా చెరువులో మ‌ట్టి పోయ‌డంపై హైడ్రా క‌మిష‌న‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంట‌నే మ‌ట్టిని తొల‌గించి పూర్తి స్థాయిలో చెరువును కాపాడి అభివృద్ధి ప‌నులు కొన‌సాగించాల‌ని సూచించారు. లేని ప‌క్షంలో చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

Advertisment
తాజా కథనాలు