హైదరాబాద్ నగరంలో హైడ్రా మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టింది. పట్టాదారులు చేసిన తప్పులకు సామాన్యులు బలవుతున్నారు. కూకట్‌పల్లిలోని పాత గ్రామంలో నల్ల చెరువుకు చెందిన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న భూమిని హైడ్రా అధికారులు కూల్చివేశారు. పట్టాదారులు ఈ భూమిని లీజుకి ఇవ్వగా కొందరు సామాన్యులు నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు చేస్తున్నారు. హైడ్రా ఈ నిర్మాణాలు కూల్చివేయడంతో సామాన్యులు బలి అయ్యారు. నల్ల చెరువు చుట్టూ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న కొంత స్థలంలో మొత్తం 45 మంది స్థానికులకు పట్టా ఉంది.
పూర్తిగా యంత్రాలు ద్వంసం
వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే వినియోగించుకోవాల్సిన భూమిని.. చట్టానికి విరుద్ధంగా కొందరు యజమానులు లీజుకు ఇచ్చారు. సామాన్యులు ఆ స్థలంలో మొత్తం 17 షేడ్లు నిర్మించుకున్నారు. ఈ నిర్మాణాలు అక్రమంగా నిర్మించారని హైడ్రా అధికారులు గుర్తించి, 15 రోజుల కిందటే నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులు పట్టాదారులకు ఇవ్వగా.. వారు ఈ విషయాన్ని సామాన్యులకు తెలియజేయలేదు. కనీసం సమయం ఇవ్వకుండా హైడ్రా ఈ నిర్మాణాలను కూల్చేయడంతో.. లీజు దారుల యంత్రాలు, ఇతర వస్తువులు అన్ని ధ్వంసమయ్యాయి.
ఇరిగేషన్ అధికారులు కనీసం సమయం ఇవ్వకుండా నిర్మాణాలు ఇలా కూల్చడంపై సామాన్యులు మండిపడుతున్నారు. అందులో రమేష అనే వ్యక్తి క్యాంటీన్ నడుపుతున్నారు. అధికారులు కనీసం సమాచారం ఇస్తే సామాగ్రిని అయిన తీసుకునేవారమని బాధపడ్డారు. ఈ భూమి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలోకి రాదని యజమానులు చెప్పడంతోనే లీజుకు తీసుకున్నామని బాధితుడు రవి బాధపడ్డాడు. హైడ్రా అధికారులు లీజు దారులకు నోటీసులు ఇవ్వకపోవడం వల్ల తాము నష్టపోతున్నట్లు బాధితులు బోరున ఏడుస్తున్నారు.
Also Read : తిరుమల ప్రసాదం గురించి ..సుప్రీం కోర్టుకు సుబ్రహ్మణ్య స్వామి!