చెరువులు, నీటి కుంటలు, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమణలు అడ్డుకోవడమే లక్ష్యంగా తెలంగాణలోని రేవంత్ సర్కార్.. హైడ్రాను తీసుకువచ్చి 100 రోజులు దాటింది. ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా పేరు మార్మోగింది. అనంతరం.. అనేక అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్లి నేలమట్టం చేయడంతో జనం జేజేలు పలికారు. నెటిజెన్లు ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో హైడ్రా చీఫ్ రంగనాథ్ సోషల్ మీడియాలో హీరోగా మారిపోయారు. అయితే.. మూసి ప్రక్షాళన అంశం ప్రారంభం అయిన నాటి నుంచి సీన్ రివర్స్ అయ్యింది. బఫర్, FTL లో సర్వేకు వెళ్లిన అధికారులను నిర్వాసితులు అడ్డుకోవడం ప్రారంభించారు. మా ఇళ్లు కూల్చొద్దంటూ వారు చేస్తున్న ఆందోళనలకు ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ హైడ్రాపై నెగటివ్ ప్రచారం ప్రారంభమైంది. దీంతో ప్రభుత్వం హైడ్రా స్పీడ్ ను తగ్గించింది.
ఇది కూడా చదవండి: మావోయిస్టులపై ఆఖరి ఆపరేషన్!
భవిష్యత్ కోసం..
చెరువులు, ఇతర నీటి వనరుల కబ్జాతో నగరంలో చిన్న పాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపించడం.. కాలనీల్లోని నీళ్లు రావడం తదితర సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ నడుం బిగించింది. దీనికి అసలు కారణం చెరువులను ఆక్రమించుకుని.. అక్కడ నిర్మాణాలు చేపట్టడమని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఎట్టిపరిస్థితుల్లో అయినా రాష్ట్రంలో ఉన్న ఈ సమస్యను తీర్చాలని రేవంత్ సర్కార్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ మేరకు జీవో 99ను తీసుకువచ్చింది. ఆపై జూలై 26 నుంచి కూల్చివేతలను ప్రారంభించింది.
100 రోజుల్లో 120 ఎకరాలు
ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బస్సు యజమానులుగా.. భట్టీ కీలక వ్యాఖ్యలు
కాగా ఇప్పటి వరకు 30 ప్రాంతాల్లో 300అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఇందులో భాగంగా 100 రోజుల్లో 120 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. GHMCతో పాటు దాదాపు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా దూకుడు ప్రదర్శించింది. కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువు బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలో, కిష్టారెడ్డిపేటలో, పటేల్‌గూడలో మొత్తం ఈ 3 ప్రాంతాల్లోని 8ఎకరాల విస్తీర్ణంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అలాగే అమీన్‌పూర్‌లో సైతం హైడ్రా పగలు రాత్రి కూల్చివేతలు చేపట్టింది. దాదాపు17 గంటలపాటు నాన్ స్టాప్ కూల్చివేతలు చేపట్టింది. ఈ కూల్చివేతలో ఒక హాస్పిటల్, రెండు అపార్ట్‌మెంట్లు కూల్చివేసింది. అలాగే పటేల్ గుడాలో 16 విల్లాలను నేలమట్టం చేసి ప్రభుత్వానికి అప్పగించింది.
ఇది కూడా చదవండి: పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా?
GHMC అధికారులు హైడ్రాకు బదిలీ
కాగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొంతమంది అధికారులను హైడ్రాకు బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు (జీవో-191) జారీ చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చేసింది. GHMC -1955 చట్టంలోని సెక్షన్ 374-B ప్రకారం.. పార్కులు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, చెరువులు, డ్రైన్‌లు, రోడ్లను పరిరక్షించనున్నారు.
మూసీ సర్వే సమయంలో హైడ్రాపై విమర్శలు..
మూసీలో సర్వే సమయంలో సామాన్యుల నుంచి రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. తెలియక బఫర్, ఎఫ్టీఎల్ లో స్థలాలు కొన్న అనేక మంది ఆందోళనకు దిగారు. ఏళ్ల క్రితం ఉంచి తాము ఇక్కడే ఉంటున్నామని.. అన్ని అనుమతులతో ఇళ్లను కట్టుకున్నామని వారు కన్నీరుమున్నీరయ్యారు. వీరికి ప్రతిపక్షాలు సైతం మద్దతు ఇచ్చాయి. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ కావడంతో.. ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి.
ఇది కూడా చదవండి: Iran సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా
దీంతో నిర్వాసితులను ఒప్పించిన తర్వాతే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావించి మూసీ ప్రాంతంలో సర్వేను తాత్కాలికంగా ఆపేసింది. హైడ్రా సైతం కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చి.. హైదరాబాద్ లోని చెరువులు, కుంటల సర్వేపై దృష్టి సారించింది. మూడు నెలల తర్వాత మళ్లీ హైడ్రా యాక్షన్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే.. మూసీ కూల్చివేతలకు, హైడ్రాకు సంబంధం లేదని ప్రభుత్వం చెబుతోంది. హైడ్రా ఇంత వరకు అక్కడ ఒక్క కూల్చివేత కూడా చేపట్టలేదని ఆ సంస్థ చీఫ్ రంగనాథ్ స్పష్టం చేస్తున్నారు.