/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/WINES-CLOSED-jpg.webp)
హైదరాబాద్ లోని మద్యం ప్రియులకు వెరీ బ్యాడ్ న్యూస్. మూడు రోజుల పాటు అంటే 2025 ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ మూడు రోజుల పాటు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 135- సీ ప్రకారం ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ఫిబ్రవరి 27 ఉదయం ఆరు గంటల వరకు వైన్ షాప్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు కొల్లూరు, ఆర్‌సీ పురం పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని కల్లు దుకాణాలు, వైన్ షాపులు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్‌లు, స్టార్ హోటళ్లలోని బార్‌లు, రిజిస్టర్డ్ క్లబ్బులు మూసివేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించి… విరుద్ధంగా మద్యం విక్రయాలు, మద్యం సరఫరాకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫిబ్రవరి 27న పోలింగ్
రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం-వరంగల్- నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎలక్షన్ జరగనుంది. దాదాపు ఎన్నికల ప్రచారం కూడా పూర్తి కావొచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉమ్మడి ఏడు జిల్లాల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.కల్లు కంపౌండ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా క్లోజ్ అవుతాయి. ఇక రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాల్లో కూడా ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్లు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా యాదాద్రి జిల్లా ఉంది. ఇక్కడ కూడా మద్యం షాపులు క్లోజ్…అవుతాయి. ఇక ఎన్నికలు జరిగే ఉమ్మడి 7 జిల్లాలకు సంబంధించి అక్కడి పోలీసులు ఆదేశాలు జారీ చేయనున్నారు.
Also Read : కుంభమేళాలో మరో ఘోర ప్రమాదం.. ముగ్గురు సంగారెడ్డి వాసులు దుర్మరణం