అల్లు అర్జున్ విడుదల మీద సస్పెన్స్ వీడిపోయింది. ఆయన రేపు ఉదయం ఆరు తర్వత ఎప్పుడైనా విడుదల అవ్వొచ్చని చంచల్ గూడ జైలు సూపరెండెంట్ నిర్ధారించారు. హైకోర్టు బెయిల్ ఉత్తర్వుల పేపర్లు అర్ధరాత్రి తమ చేతికి అందినా కూడా బన్నీ విడుదల రేపు ఉదయమే ఉంటుందని తెలిపారు. అప్పటి వరకు చంచల్ గూడ జైల్లో మంజీరా బ్యారక్‌లో అల్లు అర్జున్ ఉంటారని చెప్పారు. మరోవైపు బెయిల్ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని..జైలు సూపరింటెండెంట్, సీపీకి ఆదేశాలు హైకోర్టు జారీ చేసింది. హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అయితే కానీ సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10.30 గంటలకు అందడంతో అర్జున్‌ను రాత్రంతా చంచల్‌గూడ జైల్లోనే ఉంచారు. శనివారం ఉదయం ఆయనను విడుదల చేయనున్నట్టు జైలు అధికారులు తెలిపారు. అర్జున్‌తోపాటు సంధ్య థియేటర్ యజమానులిద్దరికి కూడా మధ్యంతర బెయిలు మంజూరైంది. అల్లు అర్జున్ రూ.50 వేల వ్యక్తిగత బాండ్‌ను చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, భజన్‌లాల్ కేసులను ప్రస్తావిస్తూ మధ్యంతర బెయిలు మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి తన ఉత్తర్వుల్లో చెప్పారు.
Also Read: CM Chandra babu: అల్లు అరవింద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్