Hyderabad : బిగ్ షాక్.. ఓఆర్‌ఆర్‌ టోల్‌ ఛార్జీలు పెంచేశారు బాబోయ్!

వాహనదారులకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డుపై టోల్‌ ఛార్జీలను ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థ పెంచింది. కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ వాహనాలకు కిలోమీటర్‌కు 10 పైసలు పెంచుతూ  నిర్ణయం తీసుకుంది.పెరిగిన ధరలు రేపటినుంచి అమల్లోకి రానున్నాయి.

New Update
orr-charge

orr-charge

వాహనదారులకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డుపై టోల్‌ ఛార్జీలను ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థ పెంచింది. కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ వాహనాలకు కిలోమీటర్‌కు 10 పైసలు పెంచుతూ  నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఛార్జీలు రూ.2.34 నుంచి రూ.2.44కు పెరిగింది. ఇక మినీ బస్‌, ఎల్‌సీవీలకు కిలోమీటర్‌కు రూ.3.77 నుంచి రూ.3.94కు పెంచారు.

Also read :  UP Crime: అలహాబాద్‌ ఐఐఐటీలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య!

2 యాక్సిల్‌ బస్సులకు కిలో మీటర్ కు రూ.6.69 నుంచి రూ.7కు పెంచారు. భారీ వాహనాలకు కిలో మీటర్ కు రూ.15.09 నుంచి రూ.15.78కి పెంచారు. పెరిగిన ధరలు రేపటి నుంచి అంటే 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా హెచ్‌ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్​(హెచ్‌జీసీఎల్) నిర్వహణలో ఉండే ఓఆర్‌ఆర్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఐఆర్‌బీ సంస్థ గత సంవత్సరం 30 ఏళ్లకు లీజుకు తీసుకుంది.  అగ్రిమెంట్ ప్రకారం ప్రతి ఏడాది టోల్ ఛార్జీలను పెంచుకునే అవకాశం ఉంది.  

 ఎన్‌హెచ్‌ఏఐ గుడ్న్యూస్

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై నిత్యం ఫుల్ రష్ గా ఉంటుంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య వారధిగా ఉండటంతో రోజుకూ వేల వాహానాలు వెళ్తుంటాయి.  అయితే ఈ రహాదారి గుండా ప్రయాణించే వాహనాదారులకు ఎన్‌హెచ్‌ఏఐ గుడ్న్యూస్ చెప్పింది. టోల్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. వచ్చే ఏడాది మార్చి 31వరకు అమలులో కొత్త రేట్లు అమల్లో ఉండనున్నాయి. ఇది వాహనదారులకు ఊరటనిచ్చే అంశమేగానే పేర్కొనవచ్చు.  

Also Read :  వావ్..! అమ్మ, నానమ్మతో క్లింకార ఎంత ముద్దుగా పూజ చేస్తుందో.. ఉపాసన వీడియో వైరల్

Aslo read :  Hyderabad : తల్లితో అక్రమ సంబంధం..ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య

Advertisment
తాజా కథనాలు