వరుస దూకుడు మీద ఉన్న హైడ్రా కూల్చివేతలకు కాస్త బ్రేక్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రజల నుంచి నిరసనలు ఎక్కువగా రావడంతో తాత్కాలికంగా కూల్చివేతలకు విరామం ప్రకటించాలని నిర్ణయం తీసుకోనుంది. రెండు నుంచి మూడు వారాల పాటు సర్కార్ బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై ఆచితూచి ముందుకు వెళ్లాలని సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు, వాణిజ్య భవనాలు, ఫామ్‌హౌస్‌లపై మాత్రమే చర్యలు తీసుకోనున్నాయి. మూసీ నిర్వాసితుల పునరావాసంపై విస్తృత ప్రచారం చేయడానికి నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read : మరోసారి తెలుగోడికే ఛాన్స్.. IPL పాలక మండలిలో చాముండేశ్వరీనాథ్‌కు చోటు