Hydra: హైడ్రా కు విస్తృత అధికారాలు

హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.ఓఆర్ఆర్‌‌కు లోపల ఉన్న గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్ లో కలిపామని..అన్నీ శాఖలకు ఉన్న స్వేచ్ఛ హైడ్రా కు ఇస్తున్నామని చెప్పింది. హైడ్రా కోసం 169 మంది అధికారులను అపాయింట్ చేసింది.

author-image
By Manogna alamuru
powers
New Update

Cabinet Meeting: 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. మూడు గంటలపాటూ సాగిన ఈ మీటింగ్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశం తర్వాత కేబినెట్ నిర్ణయాలను మంత్రులు తెలిపారు. హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించారు. ఓఆర్ఆర్‌‌కు లోపల ఉన్న గ్రామ పంచాయతీలను కోర్ అర్బన్ లో కలిపామని..అన్నీ శాఖలకు ఉన్న స్వేచ్ఛ హైడ్రా కు ఇస్తున్నామని చెప్పారు.  హైడ్రా కు 169 మంది అధికారులు 904 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఓఆర్‌ఆర్‌ లోపల 27 అర్బన్‌, లోకల్‌ బాడీలు ఉన్నాయి. వాటిల్లో 51 గ్రామ పంచాయతీలను కోర్‌ అర్బన్‌లో విలీనం చేయాలని నిర్ణయించమన్నారు మంత్రులు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం అలైన్‌మెంట్‌ ఖరారుకు కమిటీని ఏర్పాటు చేస్తామని.. ఆర్‌అండ్‌బీ స్పెషల్‌ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో 12 మందితో కమిటీ ఉంటుందని వివరించారు. కమిటీ కన్వీనర్‌గా ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉంటారు. వీటన్నిటితో పాటూ పోలీసు ఆరోగ్య భద్రత స్కీమ్‌ ఎస్‌పీఎల్‌కు కూడా వర్తిస్తుందని మంత్రులు చెప్పారు. 

ఇక మనోహరాబాద్‌లో 72 ఎకరాల్లో లాజిస్టిక్‌ పార్క్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది తెలంగాణ కేబినెట్. 8 వైద్య కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకం. 3వేలకు పైగా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌..ఖమ్మం జిల్లాలో 58 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఆమోదం..ఏటూరునాగారం ఫైర్‌ స్టేషన్‌కు 34 మంది సిబ్బంది మంజూరు..కోస్గి ఇంజినీరింగ్‌ కళాశాల, హకీంపేటలో జూనియర్‌ కళాశాల మంజూరు..వీర నారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ..సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం..కొండా లక్ష్మణ్ బాపూజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ..సన్న వడ్ల కు 500 బోనస్ ఇచ్చేందుకు కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుదని మంత్రులు తెలిపారు.

Also Read: కార్పొరేట్ హత్యలు.. పని చేస్తున్నామా..చావుకు దారులు వేసుకుంటున్నామా?

#hydra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe