హనుమాన్ టెంపుల్‌పై దాడి.. దేవుడి విగ్రహాలు ఎలా పడ్డాయో చూడండి!

శంషాబాద్ మున్సిపాలిటీలోని ఓ హనుమాన్ గుడి పై దుండగులు దాడికి తెగబడ్డారు. గుడిలోని నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేశారు. దీనిపై పలు హిందూ సంఘాల నాయకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

New Update

 హైదరాబాద్ లో వరుసగా దేవుళ్ళ గుడులపై దాడులు జరగడం, విగ్రహాలు ధ్వంసం చేయడం వంటి ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి పై జరిగిన దాడి ఘటన మరవకముందే.. మరో ఆలయం పై దాడి జరగడం కలకలం రేపుతోంది. 

Also Read: వరుణ్, లావణ్య మొదటి పెళ్లిరోజుకు మెగాస్టార్ అదిరిపోయే గిఫ్ట్!.. వీడియో వైరల్

శంషాబాద్ హనుమాన్ టెంపుల్ పై దాడి

ఈరోజు శంషాబాద్ మున్సిపాలిటీ ఎయిర్ పోర్ట్ కాలనీలోని ఓ హనుమాన్ గుడి పై గుర్తుతెలియని దుండగులు దాడికి తెగబడ్డారు. గుడిలోని నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేశారు. దీంతో ఆందోళనకు దిగిన కాలనీ వాసులు..  గుడి పై దాడికి పాల్పడిన నిందితులను శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.  పలు హిందూ సంఘాల కూడా విగ్రహాల ధ్వంసంపై   ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ ఘటనలో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. 

Also Read: హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. VD12 షూటింగ్ లో అలా..!

ఇటీవలే అంబర్ పేటలో

ఇది ఇలా ఉంటే ఇటీవలే  అంబర్ పేటలో ఓ వ్యక్తి గ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అంబర్ పేటలోని మహంకాళి టెంపుల్ లోకి ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి.. వచ్చేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన పూజారి..  తాగి ఆలయంలోకి రావడం సరికాదని చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన ఆ తాగుబోతు విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు అతడిని అడ్డుకున్నారు. పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనికి ముందు సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంపై దాడికి చేశారు. అర్థరాత్రి ఇద్దరు దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఒక నిందితుడిని పట్టుకోగా మరొకడు తప్పించుకున్నాడు. 

Also Read: రెండో సారి కూడా ఆ పని చేసే అమ్మాయితోనే డైరెక్టర్ క్రిష్ పెళ్లి..?

Also Read: చిరు, నాగ్, వెంకీలో నాకు ఇష్టమైన హీరో అతనే.. బాలయ్య భలే చెప్పాడుగా!

Advertisment
Advertisment
తాజా కథనాలు