High court Orders to Hydra:
ఇప్పటికే ఐడ్రాకు హైకోర్టు చాలాసార్లు చివాలు పెట్టింది. అలా ఎలా కూల్చేస్తారంటూ మండిపడింది కూడా. ఇప్పుడు తాజాగా కేఏపాల్ వేసిన పిటిషన్‌ను మీద విచారణ చేసిన హైకోర్టు ముందుగా నోటీసులు ఇవ్వకుండా ఏ ఇల్లునూ లేదా కట్టడాన్ని కూల్చడానికి వీలు లేదంటూ హైడ్రాకు ఆర్డర్‌ను పాస్ చేసింది. కేఏపాల్ వేసిన పిటిషన్‌ను విచారణ చేసిన హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. పార్టీ ఇన్ పర్శన్‌గా కేఏపాల్ తన వాదనలను వినిపించారు.
Also Read: AP:అన్నా చెల్లెళ్ళ ఆస్తి వివాదం..జగన్, షర్మిల లేఖలను బయటపెట్టిన టీడీపీ
Also Read: Hyd:ఈడీ కార్యాలయంలో ముగిసిన సీనియర్ ఐఏఎస్ అమోయి కుమార్ విచారణ
కేఏపాల్ వాదనలు విన్న తర్వాత కోర్టు..నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి కూల్చి వేతలు చేపట్టొద్దని ఆదేశించింది. ప్రత్యామ్నాయం చూసుకునేంతవరకు బాధితులకు సమయం ఇవ్వాలని చెప్పింది. మూసీ ఏరియా బాధితులకు ఇల్లు కట్టించిన తర్వాతనే కూల్చివేతలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. అయితే దీనిపై స్పందించిన హైడ్రా తరుఫు అడిషనల్ అడ్వకేట్ జనరల్.. మూసీ బాధితులకు ఇల్లు కేటాయించిన తర్వాతే కూల్చివేతలు చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. అయితే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, హైడ్రాకు హైకోర్టు ఆదేశించింది.