Hyd:ఒక్కడు కాదు చాలామందే..అమ్మవారిపై దాడి కేసులో సంచలన నిజాలు.

హైదరాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మవారి ఆలయ విగ్రహం ధ్వంసం కేసులో నిందితుడు సల్మాన్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో షాకింగ్ నిజాలు బయటపడున్నాయి. ఈ దాడి వెనుక అసలు వ్యక్తి మరొకరు ఉన్నారని తెలుస్తోంది. వివరాలు కింది ఆర్టికల్‌లో...

hyd
New Update

secunderabad tmple vandalism:

కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయ విగ్రహ ధ్వంసం కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అమ్మవారిపై దాడి స్పృహలేకుండా చేసిందో, లేక ఆవేశపూరితంగా చేసిందో కాదని... పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. అమ్మవారి విగ్రహాన్ని కాలుతో తన్నిన ప్రధాన నిందితుడు సలీం సల్మాన్‌ పోలీసులు ఘటన జరిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో సల్మాన్ ఒక్కడే నిందితుడు కాదని...ఇతని వెనుక మునావర్ జమా అనే వ్యక్తి ఉన్నాడని తెలుస్తోంది. అమ్మవారిపై దాడికి ముందు సల్మాన్‌ ఓ మత విద్వేష సదస్సుకు హాజరయ్యాడు. ఇది మునావర్ నిర్వహించినదే. ఇందులోనే సల్మాన్‌ను అమ్మవారి విగ్రహాన్ని తన్నాలని మునావర్ రెచ్చగొట్టాడు. దీంతో అసలెవరీ మునావర్? ఎందుకు సల్మాన్‌ను రెచ్చగొట్టాడు అనే విషయాలపై పోలీసులు ఆరా తీశారు.

Also Read: హీరోయిన్ తమన్నా ఈడీ విచారణ..బెట్టింగ్ యాప్ కేసులో ప్రశ్నలు

మత విద్వేష ప్రచారకుడు...
  

అమ్మవారిపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పేరు మునావర్ జమా. ఇతను ఉండేది ముంబైలో. మోటివేషనల్ స్పీకర్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ ట్రైనర్. అయితే ఇది బయటకు చెప్పుకునే ఐడెంటిటీ...కానీ ఆ ముసుగులో మునావర్ చేసేవన్నీ మత విద్వేష ప్రసంగాలే. మత ఘర్షణలను ప్రేరేపించడమే ఇతని మెయిన్ మోటో. ఈ తరహా పనిని మనావర్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు. ముంబై, హైదరాబాద్, బెంగళూర్లలోనే కాక  సింగపూర్, మలేషియా లాంటి విదేశాల్లో కూడా సదస్సులు నిర్వహించాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఈనెల 1 నుంచి 31 వరకు నెలరోజుల సదస్సు కు ప్లాన్ చేశాడు. మెట్రో పోలిస్ హోటల్ ను వేదిక అనుకున్నాడు. ఈ సదస్సులకు ముత్యాలమ్మ విగ్రహంపై దాడి చేసిన సల్మాన్‌  కాక మరో 150 మంది హాజరయ్యారు. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వాళ్లు ఇక్కడికి వచ్చారు. మెట్రో పోలీస్‌ హోటల్‌లో ఓ 49 రూముులను వీళ్లకోసం ప్రత్యేకంగా కేటాయించారు. అయితే ఈ సదస్సుకు ఎలాంటి అనుమతులూ లేవు. అందుకే అమ్మవారి ఘటన తర్వాత సదస్సు ఏర్పాటు చేసిన మునావర్ జమాతో పాటు హోటల్ యజమాని అబ్దుల్ రషీద్, మేనేజర్ రెహమాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మెట్రోపోలీస్‌ హోటల్‌ను సీజ్ చేశారు.

Also Read: యాదాద్రి లడ్డూ నెయ్యి పాస్ ..మరోసారి తెరమీదకు తిరుమల లడ్డూ వ్యవహారం

రెచ్చగొట్టే ప్రసంగాలు..

ఇక హైదరాబాద్ మెట్రో పోలిస్ హోటల్లో జరిగిన సదస్సులో మునావర్  రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అక్కడే ముత్యాలమ్మ ఆలయంపై దాడి చేయాలని సల్మాన్‌ను మునావర్ రెచ్చగొట్టాడని చెబుతున్నారు. ఆ తరువాతనే అక్టోబర్‌ 14 రాత్రి సల్మాన్‌ ముత్యాలమ్మ ఆలయంపై దాడి చేశాడు. దీంతో ఇప్పుడు మునావర్‌ మత విద్వేష ప్రసంగాలపై పోలీసులు దృష్టి సారించారు. వాటి మీద లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అక్టోబర్‌ 1 నుంచి  మునావర్ ఏమేం మాట్లాడాడో మొత్తం వివరాలు సేకరిస్తున్నారు. అంతకుముందు నిర్వహించిన సదస్సులపైనా దృష్టి పెట్టారు. అమ్మవారి మీద దాడి చేసిన సల్మాన్‌ను అదేరాత్రి స్థానికులు పట్టుకుని కొట్టి పోలీసులకు అప్పగించారు. అతనిని విచారించినప్పుడే మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చాయి. 

Also Read: హమాస్ ఛీఫ్ యహ్వా సిన్వార్ ను ఇజ్రాయెల్ చంపేసిందా? ఆరా తీస్తున్న ఐడీఎఫ్

Also Read: మళ్ళీ బాంబు బెదిరింపు..ఈసారి ముంబయ్‌‌–లండన్ ఎయిర్ ఇండియా విమానానికి

 

 

 

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe