మళ్ళీ బాంబు బెదిరింపు..ఈసారి ముంబయ్‌‌–లండన్ ఎయిర్ ఇండియా విమానానికి

వరుసగా నాలుగో రోజు కూడా ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబయ్ నుంచి లండన్ వెళుతున్న ఫ్లైట్‌లో బాంబు పెట్టారని సమాచారం రావడంతో ఎమర్జెన్సీ ప్రకటించారు. 

author-image
By Manogna alamuru
New Update
Vijayawada : బెజవాడ వాసులకు శుభవార్త!

Mumbai to london Air India Flight: 

దేశీ, అంతర్జాతీయ విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతూనే ఉన్నాయి. విమానాలకు బాంబు బెదిరింపు మెసేజ్‌లు ఎవరు పెడుతున్నారో తెలిసింది. ఎందుకు పెడుతున్నారో కూడా కారణాలు తెలిసాయి అని చెప్పారు. నిందితుడిని పట్టుకున్నామని కూడా అన్నారు. ఫ్లైట్స్‌లో ఎయిర్ మార్షల్స్ ను పెంచుతాం...భద్రతను కట్టుదిట్టం చేస్తాం అని చెప్పారు. ఇన్ని జరిగినా కూడా బాంబుల బెదిరింపులు మాత్రం ఆగడం లేదు.  వరుసగా ఈరోజు కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు మెసేజ్ వచ్చింది. మంబై నుంచి లంన్ వెళుతున్న విమానం ఇంకొన్ని గంటల్లో ల్యాండ్ అవుతుంది అనగా ఇది జరగడంతో వెంటనే ఎమర్జెన్సీని ప్రకటించారు. స్క్వాకింగ్ 7700’’ కోడ్‌ని పంపించింది. ఇది సాధారణ అత్యవసర పరిస్థితిని తెలియజేస్తుంది.

Also Read: మాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు–ఇరాన్ కమాండర్ వార్నింగ్

Also Read:IRCTC:ఐఆర్సీటీసీలో కీలక మార్పు..అడ్వాన్స్ బుకింగ్స్ 60 రోజులకు కుదింపు

నాలుగు రోజుల్లో ఇప్పటికి 20 విమానాలకు నకిలీ బాంబు బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి.  ఈరోజు 5 ఎయిర్ ఇండియా, రెండు విస్తారా, రెండు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న ఈ అంశంపైనే పార్లమెంటరరీ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, డీజీసీఏ అధికారులతో విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు సమావేశమయ్యారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రయాణీకులు భద్రతే తమ ప్రాధాన్యమని ఆయన అన్నారు. ఈ ఘటనలపై సమగ్ర నివేదిక పంపాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖను హోం మంత్రిత్వ శాఖ కోరింది.

ఇది కూడా చదవండి: TGPSC GROUP-1: గ్రూప్-1 మెయిన్స్ పై సీఎస్ కీలక ఆదేశాలు!

ఇది కూడా చదవండి:Telangana: తెలంగాణలో మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ !

Advertisment
Advertisment
తాజా కథనాలు