Bus seize: పండగ ఎఫెక్ట్‌.. 10 బస్సులు సీజ్‌ !

పండగ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆర్టీఏ అధికారుల స్పెషల్‌ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. నిబంధనలు పాటించని, ఫిట్‌నెస్‌ లేని ట్రావెల్స్ బస్సులపై కేసు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద అంబర్‌పేట్‌లో నిబంధనలు పాటించని 10 బస్సులను సీజ్ చేశారు

New Update

10 బస్సులు సీజ్.. 

వారం రోజులుగా  ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న అసికారులు ఇప్పటికే 150   బస్సులపై  కేసులు నమోదు చేశామని  అని వివరించారు. ఈ క్రమంలో తాజాగా .. 10 బస్సులను సీజ్ చేశారు.  పెద్ద అంబర్ పేట్ దగ్గర నిర్వహించిన తనిఖీలో 10 బస్సులను సీజ్ చేసినట్లు  తెలుస్తోంది. అలాగే ఆరంఘర్ చౌరస్తా వద్ద చెన్నై, తిరువంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి నుంచి వస్తున్న పలు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను  తనికీ చేసిన అధికారులు...  నిబంధనలు పాటించని, ఫిట్‌నెస్‌ లేని 11 బస్సులపై కేసు నమోదు చేశారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ 6, 432 ప్రత్యేక బస్సులు కేటాయించింది. అంతేకాదు  అవసరమైతే మరిన్నింటిని నడిపేందుకు ఆర్టీసీ అధికారులు సిద్దంగా ఉండాలని స్పష్టం చేసింది.

విశాఖ పట్టణం. రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌  ప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక బస్సులకు టికెట్ ధరలు 50 శాతం వరకు పెరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. మరోవైపు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు విమానల టికెట్ ధర రూ. 14 వేలకు పైగా ఉంది.  రాజమండ్రికి రూ.22 వేలు ఉంది.

Also Read: Nora Fatehi: కార్చిచ్చులో ఇరుక్కుపోయిన నటి.. వీడియో వైరల్‌.. అమెరికాలో ఏం జరుగుతోంది?

ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు