HYD: మోహన్‌బాబుకు రాచకొండ సీపీ నోటీసులు

సీనియర్ నటుడు మోహన్ బాబుకు రాచకొండ సీపీ నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రేపు జల్ పల్లి లోని జరిగిన ఘటన పై సీపీ విచారణ చేయనున్నారు. 

New Update
mohan babu,

నటుడు మోహన్ బాబు ఇంటి వ్యవహారం రచ్చకెక్కింది. తనను కొట్టారంటూ కొడుకు మంచు మనోజ్ పోలీసులకు కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. తండ్రీ–కొడుకులు, అన్నదమ్ములు అందరూ తగవులాడుకుంటూ వీధికెక్కారు. హైదరాబాద్‌లోని జల్‌పల్లిలో మోహన్‌బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మోహన్ బాబు నివాసం గేట్లను మనోజ్ తోసుకుంటూ లోపలికి వెళ్లడంతో గందరగోళం ఏర్పడింది. మనోజ్ తన భార్య మౌనికతో కలిసి మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ గట్టిగా అరుపులు అరిచారు. లోపల తన కూతురు ఉంది అంటూ అక్కడి భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సెక్యూరిటీ సిబ్బంది గేట్లు తీయలేదు. దీంతో కాసేపు అక్కడే ఉన్న మంచు మనోజ్.. ఆ తర్వాత తన అనుచరులతో కలిసి మోహన్ బాబు ఇంటి గేట్లు నెట్టుకుని లోపలికి ప్రవేశించారు. అదే సమయంలో మనోజ్‌ వెంట వచ్చిన బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారు. కాగా దాడి జరగడంతో చిరిగిన షర్ట్‌తోనే మనోజ్ బయటకు వచ్చారు. ఈనేపథ్యంలో మోహన్‌ బాబు మీడియాపై కూడా దాడి చేశారు. 

సీపీ నోటీసులు..

ఈ కేసుకు సంబంధించి రాచకొండ సీపీ నటుడు మోహన్‌బాబుకు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 10.30 గంటలకు వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. జల్ పల్లి లోని జరిగిన ఘటన సీపీ విచారణ చేయనున్నారని తెలుస్తోంది. జల్ పల్లి లో జరిగిన దాడి ఘటన పై సీపీ సీరియస్ అయ్యారని అందుకే విచారణకు పిలిపిస్తున్నారని చెబుతున్నారు.  మరోవైపు ఇప్పటికే మంచు మోహన్ బాబు, విష్ణుల నుంచి లైసెన్స్ గన్స్‌ను  స్వాధీనం చేసుకున్నారు. జూబ్లి హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ తీసుకొని మంచు విష్ణు, మోహన్ బాబుల గన్స్ కు వాడుతున్నారు. వారి ఫ్యామిలీ గొడవల కారణంగా పోలీసులు వాటిని హ్యాడ్ ఓవర్ చేసుకున్నారు.  మోహన్ బాబు, విష్ణుల నుంచి తనకు ప్రాణహాని ఉందని మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కారణంగానే ఈ చర్య తీసుకున్నట్లు రాచకొండ పోలీసులు చెప్పారు. 

Also Read: HYD: మనిషివా..మోహన్ బాబువా..సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ ఆగ్రహం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు