HYD: సీఎం రేవంత్ ను పెళ్ళికి ఆహ్వానించిన పీవీ సింధు

ఒలింపిక్ విజేత పీవీ సింధు పెళ్ళి ఈ నెలలోనే. పెదదలు కుదిర్చిన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న ఇంధు తన పెళి కార్డులను అందరికీ పంచుతూ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా  కలసి వివాహానికి హాజరు కావాని ఆహ్వానించింది. 

New Update
wed

డిసెంబర్ 22వ తేదీన రాజస్థాన్‎లోని ఉదయ్‌పూర్‌ వేదికగా సింధు వివాహం జరగనుంది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన వెంకట దత్త సాయిని సింధు వివాహం చేసుకోనుంది.   కటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ వీరి నిశ్చితార్థం ఈరోజు జరిగింది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. మరో వారం రోజుల్లో పెళ్ళి కూడా జరగనుంది. ఇప్పటకే ఈ పెళ్ళికి భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలను పీవీ సింధు ఆహ్వానించిందని...వారు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.  

రేవంత్‌కు కార్డు..

ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‎ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సింధు కలిసింది. తన వివాహానికి అటెండ్ కావాలని సీఎం రేవంత్ రెడ్డిని  సింధు ఆహ్వానించింది. ఈ సందర్భంగా దాదాపు రెండేళ్ళ తర్వాత రీసెంట్‌గా సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ ట్రోఫి గెల్చిన పీవీ సింధును రేవంత్ అభినందించారు. రెండేళ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్ టైటిల్ నెగ్గిన సింధుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 

Also Read: Israel: సిరియాపై ఇజ్రాయెల్ వరుస దాడులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు