![11](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/14/aYa0gDguAdlPzyeKmWiI.jpg)
సిరియా రాజధాని డమాస్కస్ మీద ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. రాజధాని శివారు ప్రాంతాల్లో ఉన్న క్షిపణి బంకర్లను నాశం చేస్తోంది. పర్వతాల దిగువన ఏర్పాటు చేసిన బంకర్లలోని రాకెట్లను, ఆయుధసామగ్రిని ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసిందని బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ స్పష్టం చేసింది. అంతేకాకుండా పర్వతసానువుల్లోని సొరంగాలను, ఆయుధ డిపోలను, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను కూడా ఐడీఎఫ్ బలగాలు నాశనం చేశాయని సిరియా చెప్పింది. అంతేకాదు డమాస్కస్‌కు ఉత్తరంగా ఉన్న బార్జేలోని మిలటరీ శాస్త్రసాంకేతిక విభాగాలకు చెందిన సామగ్రిని కూడా ఐడీఎఫ్ ధ్వంసం చేసింది.
ఇంతకు ముందు సిరియాకు, ఇజ్రాయెల్ కు మధ్య అటాక్స్ జరిగాయి. హమాస్‌తో యుద్ధం జరుగుతున్నప్పుడు సిరియా కెమికల్ ఆయుధాలను ప్రయోగించింది. దానికి ప్రతీకారం ఇప్పుడు ఇజ్రాయెల్ తీర్చుకుంటోంది. ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడు అసద్ దేశం విడిచి పారిపోయాడు. దీంతో ఇదే సరైన సమయం అనుకున్న ఇజ్రాయెల్ దాడులకు దిగింది. వ్యూహాత్మక ప్రదేశాల్లో ఉన్న సిరియా యుద్ధ సామగ్రిని, మిలటరీ వ్యవస్థను సమూలంగా నాశనం చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు సైన్యానికి ఐడీఎఫ్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ఇజ్రాయెల్ గవర్నమెంట్. అవసరమైతే అక్కడ కొన్నాళ్లపాటు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆ దేశ రక్షణశాఖ మంత్రి ఉన్నతాధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికి 350 సార్లు సిరియా సైనిక స్థావరాలపై దాడులు చేశామని ఐడీఎఫ్ తెలిపింది.
Also Read: Haryana: హర్యానా నూహ్‌లో మరోసారి ఉద్రికత్త... యువతి సజీవదహనం