Adulterated Milk: హైదరాబాద్‌లో కల్తీపాలు.. లీటర్ ఎంతంటే..?

హైదరాబాద్‌లో కల్తీపాలు కలకలం రేపాయి. మేడిపల్లి పరిధిలోని పర్వతాపూర్‌లో కల్తీపాల తయారీ స్థావరంపై SOT పోలీసులు దాడి చేశారు. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, గ్యాన్‌ స్కిమ్డ్‌ మిల్క్‌ పౌడర్‌తో కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

New Update
adulterated milk

హైదరాబాద్‌లో కల్తీపాలు కలకలం రేపాయి. మేడిపల్లి పరిధిలోని పర్వతాపూర్‌లో కల్తీపాల తయారీ స్థావరంపై SOT పోలీసులు దాడి చేశారు. హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, గ్యాన్‌ స్కిమ్డ్‌ మిల్క్‌ పౌడర్‌తో కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అలా కల్తీతో తయారు చేసిన పాలను గుట్టుచప్పుడు కాకుండా నిజమైన పాలతో కలిపి రూ.60లకు అమ్ముతున్నట్లు సమాచారం.

110 లీటర్ల కల్తీ పాలు, 1.1 లీటర్ల హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, 19 గ్యాన్‌స్కిమ్డ్‌ మిల్క్‌ పౌడర్‌ ప్యాకెట్లు  స్వాధీనం చేసుకున్నారు. కల్తీపాలు తయారు చేస్తున్న గంగలపూడి మురళీకృష్ణారెడ్డిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు