మరిన్ని ఇళ్ళ ముందు స్టే బోర్డులు..రేవంత్ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

 ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా తీసుకున్న మసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు మొదటి నుంచీ అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇళ్ళ ముందు స్టే బోర్డులు దర్శనిమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యూహం ఏంటి? ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకు వెళుతుంది?

hyd
New Update

Musi Conflict: 

మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి అంటే మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. ఈ ప్రాజెక్టును దశల వారీగా చేపట్టనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. మూసీ నది సుందరీకణ చేయాలంటే...ఆ నది చుట్టూ ఉన్న ఇళ్ళను తొలగించాలి. ప్రభుత్వం ప్రకారం మూసీ నదిని ఆక్రమించి ఈ ఇళ్ళన్నీ కట్టుకున్నారు. ఇప్పుడు నది ప్రక్షాళన చేయాలంటే ఈ ఇళ్ళను తీయక తప్పని పరిస్థితి.

ప్రతిష్టాత్మకం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

మూసీ నది సుందరీకరణను కంఆగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీని కోసం లండన్ వెళ్ళి మరీ స్టడీ చేసి వచ్చారు. అక్కడి థేన్ నది...దాని చుట్టూ నగరం తరహాలోనే హైదరాబాద్, మూసీ నదులను మార్చాలని రేవంత్ ప్రభుత్వం అనుకుంటోంది. దీన్ని ఎలా అయినా సాధ్యం చేస్తామని మరీ మరీ చెప్పింది కూడా. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నాం అని చెప్పారు రేవంత్ రెడ్డి.

అయితే మూసీ నది ప్రక్షాళన చేయాలంటే..బఫర్ జోన్‌లో ఉన్న ఇళ్ళను తీసేయాలి. దాంతో పాటూ మూసీ నదిని ఆక్రమించి చాలా ఇళ్ళను కట్టేశారు. వాటి లెక్కలు కూడా వేయాలి. ఎన్ని కిలోమీటర్ల మేరాక్రమణ చేశారన్నది తెలియాలి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నదికి 50 మీటర్ల బఫర్ జోన్ ఉన్నట్లు 2016 జనవరి 5న ప్రభుత్వం జీవో నెం.7 జారీ చేసినట్లు హెచ్ఎండీఏ చెబుతోంది. దీనికి ప్రకారం మూసీ నదికి కూడా 50 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూడు నెలల కిందట డ్రోన్ సాయంతో మూసీ నదిలో కట్టడాలపై సర్వే చేశారు. మొత్తం 55 కిలోమీటర్లు మూసీ వెంట సర్వే చేసి, దాదాపు 10,600 కట్టడాలు, ఇళ్లు మూసీ బఫర్ జోన్, రివర్ బెడ్‌లో ఉన్నాయని తేల్చారు. ఇప్పటికే నదీ గర్భంలో గుర్తించిన నిర్మాణాలకు గుర్తులు కూడా వేశారు అధికారులు.

AP: దక్షిణ కోస్తా, రాయలసీమకు తుపాన్ ముప్పు..హోంమంత్రి సమీక్ష

ఇక్కడే వచ్చింది అసలు చిక్కంతా..

అంతా బాగానే ఉంది..మూసీ నదిని ప్రక్షాళన చేస్తారు..నదిని అందంగా తయారు చేస్తారంటే హైదరాబాద్ ప్రజలంతా మెచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ దాని కోసం నది చుట్టూ ఉన్న ఇళ్ళను తొలగిస్తారు అనే మాట మాత్రం జనాలకు మింగుడుపడలేదు. ఈ విషయంపై పెద్ద ఎత్తున నిరసన ఎదురయింది. ఇళ్ళను కూల్చేయడానికి వచ్చిన బుల్డోజర్లను ప్రజలు అడ్డుకున్నారు. తమ ప్రాణాలు అయినా పోగొట్టుకుంటాం కానీ...ఇళ్ళను మాత్రం కూల్చనివ్వం అని చెప్పారు. తాము ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నామని..బాగా సెటల్ అయిపోయామని హైదరాబాద్ వాసులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం మూసీ నదిని ఆక్రమించుకుని కట్టుకున్నారని అందుకే ఇళ్ళను తొలగిస్తున్నామని చెప్పింది. ఇక్కడ ఇళ్ళను పోగొట్టుకున్న వారికి టూ బెడ్ రూమ్ ఇళ్ళను ఇస్తామని కూడా చెప్పింది. అయితే ఇప్పటికే ఈ ప్రాంతంలో సెటిల్ అయిపోయిన వారికి మాత్రం ఈ మార్పు రుచించడం లేదు. తాము ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నామని...బోలెడంత డబ్బులు పెట్టుకుని ఇండ్లు కట్టుకున్నామని...ఇప్పుడు మా సొంత స్థలాలను, ఇళ్ళను వదిలేసి వెళ్లిపోమంటే ఎలా అంటూ వాదిస్తున్నారు. గత కొన్ని రోజులుగా...ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఈ తగువు నడుస్తోంది. 

hyd

Also Read: సల్మాన్ ఇంటి దగ్గర భారీ భద్రత..24/7 పోలీస్ పెట్రోలింగ్

స్టే తెచ్చుకున్న యజమానులు..

మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ మూసీ సుందరీకరణ పనులు చేపట్టింది. దానిలో భాగంగా ఇళ్ళను కూల్చేందుకు వెళ్ళింది. అయితే చాలా ఇండ్ల దగ్గర హైకోర్టు స్టే బోర్డులు కనిపిస్తున్నాయి.  చైతన్యపురి, ఫణిగిరి కాలనీ, సత్యానగర్, కొత్తపేటలో చాలా ఇళ్ళ ముందు ఇవి దర్శనమిస్తున్నాయి. దాదాపు 100 ఇండ్ల యజమానులు స్టే తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. మూసీ సుందరీకరణ కోసం తమ ఇళ్ళను ఇచ్చే ప్రసక్తే లేదని...న్యాయ పోరాటం కోసం ఎక్కడిదాకైనా వెళతామని వారు చెబుతున్నారు. 

hyd

మొన్న దాదాపు వంద ఇళ్ళ ముందు స్టే బోర్డులు కనిపించాయి. ఇక నిన్న కొత్తగా మరికొన్ని ఇళ్ళ ముందు కూడా స్టే బోర్డులు దర్శనమిచ్చాయి. ప్రభుత్వం ఎంత చెప్పినా తాము మాత్రం ఇక్కడి నుంచి కదిలేదే లేదని అంటున్నారు జనం. ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు...తాము ఎంతో కష్టపడి, ఇష్టపడి కట్టుకున్న ఇండ్లకు ఏ మాత్రం సరిపోవని చెబుతున్నారు. అవి కేవలం ఇళ్ళు మాత్రమే కాదని...తమ మొత్తం జీవితం అని అంటున్నారు. ఇప్పుడు వీటిని వదిలేసి వెళ్ళిపోతే తమ మొత్తం జీవనం అస్తవ్యస్తం అయిపోతుందని వాపోతున్నారు.

 

Also Read: Bengaluru: బెంగళూరును ముంచెత్తిన వర్షాలు..

ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయనుంది..

ముందే చెప్పుకున్నట్టు మూసీ నది ప్రక్షాళనను రేవంత్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థుతుల్లోనూ ఆక్రమణలను తొలగించి మూసీ నది ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇంతకు ముందే తెలిపారు. పరీవాహక ప్రాంతంలోని 11 వేలకు పైగా నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని చెప్పారు. అయితే మూసీ కూల్చివేతలపై హైకోర్టు కూడా ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. చార్మినార్‌‌ను కూడా కూల్చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ప్రజలు అదే హైకోర్టులో స్టే తెచ్చుకుంటున్నారు. దీంతో మూసీ సుందరీకరణ పనులు ముందుకు సాగడం లేదు. ఈ పరిస్థితుల్లో  ప్రభుత్వం ఏం చేయనుందో అన్నది ఆసక్తిగా మారింది. 

హైడ్రా విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన విషయంలో కూడా అదే చేయనుందా అనే టాక్ నడుస్తోంది. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా..వారిని బుజ్జగించి మూసీ పనులు చేస్తుంది అని అధికారులు చెబుతున్నారు. ఆక్రమణలను తొలగించి మూసీ నది ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పరీవాహక ప్రాంతంలోని 11 వేలకు పైగా నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని చెప్పారు. హైడ్రా కూల్చివేత‌లు ఆగ‌వని స్పష్టం చేశారు. అదే సయంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళనను కూడా వదిలేది లేదని తెలుస్తోంది. కొంచెం టైమ్ పట్టినా ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత పెరగకుండా..ఈ పనులు చేఆలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. దీని కోసం ముఖ్యమంత్రి, అధికార యంత్రాంగం ఏ నిర్ణయం తీసుకుంటుందో మాత్రం తెలియాల్సి ఉంది. 

Also Read: నవంబర్ 13న వాయనాడ్ బై పోల్..బరిలోకి ప్రియాంక

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe