AP: దక్షిణ కోస్తా, రాయలసీమకు తుపాన్ ముప్పు..హోంమంత్రి సమీక్ష

దక్షిణ కోస్తా, రాయలసీమలకు భారీ తుఫాన్ హెచ్చరిక ఉంది. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణశాఖ మంత్రి వంగలపూడి అనిత వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. 

New Update
Vishakhapatnam Rains: విశాఖలో భారీ వర్షం.. రాకపోకలు, స్కూళ్లు బంద్‌

Heavy Rains: 

దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగంలో బలపడిన అల్పపీడనం.. రానున్న 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశముంది. ఇది రేపు ఉదయానికి తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది.  దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో రేపు  కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు, ఎల్లుండి కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. 

Also Read: సల్మాన్ ఇంటి దగ్గర భారీ భద్రత..24/7 పోలీస్ పెట్రోలింగ్

హోంమంత్రి సమీక్ష..

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంతో ఆంధ్ర ప్రదేశ్ హోం మంత్రి అనిత  ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాల యంత్రాంగాన్ని సంసిద్ధంగా ఉంచాలని హోం మంత్రి సూచించారు. సహాయక చర్యల నిమిత్తం ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్టు ఆమె తెలిపారు. తాడేపల్లి విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలోనే ఉండి జిల్లా కలెక్టర్లకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారు. దీంతో పాటూ చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి, ప్రకాశం జిల్లాలలోని ప్రతి మండలంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. మత్స్యకారులు, రైతులు, గొర్రెల కాపరులు తుపాను ప్రభావం ఉన్నంత వరకూ బయటికి వెళ్లకూడదని హోం మంత్రి విజ్ఞప్తి చేశారు.

Also Read: Bengaluru: బెంగళూరును ముంచెత్తిన వర్షాలు..

Advertisment
తాజా కథనాలు