Metro Secong Phase:
హైదరాబాద్‌లో మెట్రో రైలు కొత్త మార్గాల పనులు మొదలవనున్నాయి. ఐదు మార్గాల్లో మెట్రో రెండో దశ పనులు ప్రారంభం కానున్నాయి. కారిడార్ 4లో నాగోల్ – శంషాబాద్, కారిడార్ 5లో రాయదుర్గం – కోకాపేట, కారిడార్ 6లో ఓల్డ్ సిటీ mgbs – చాంద్రాయణగుట్ట, కారిడార్ 7లో మియపూర్ – పఠాన్ చెరు, కారిడార్ 8లో ఎల్బీ నగర్ – హయత్ నగర్, కారిడార్ 9లో ఎయిర్ పోర్టు – ఫోర్త్ సిటీ రానున్నాయి. మొత్తం నాలుగు కారిడార్లు 76.4 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగనుంది. ఎయిర్ పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ వరకు ఈ పనులు జరగనున్నాయి. రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 7333 (30%), కేంద్రం 4230 కోట్లు (18%), 11693 (48%)కోట్లు అప్పు, 1033 కోట్లు (4%) ప్రైవేట్ సంస్థలు తీసుకురావాలని నిర్ణయించారు.
ఈ రెండో దశ మెట్రో పనులు నాలుగేళ్ళల్లో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. మొదట ఆరు కారిడార్లో మొత్తం 116.4 కిలోమీటర్ల మెట్రో లైన్ నిర్మించాలని భావించినా..అది వర్కవుట్ కాలేదు. దీంతో ప్రస్తుతానికి ఐదు కారిడార్లను నిర్మించడనికి సిద్ధమైంది. ముది దశలో 22 వేల కోట్లతో పీపీపీ మోడల్‌లో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో రైలు మార్గాలను నిర్మించారు. వీటిల్లో ఇప్పుడు రోజూ 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. రెండో దశ పూర్తయితే రోజుకు 8 లక్షల మంది ప్రయాణించవచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: NSE: స్టాక్ మార్కెట్లోకి తెలుగు..మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఎన్‌ఎస్‌ఈ