KIMS: శ్రీతేజ్ ఆరోగ్యం విషమం.. హెల్త్ బులెటిన్ విడుదల సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యం విషయంగా ఉందని కిమ్స్ వైద్యులు చెబుతున్నారు. కొద్దిసేపటి క్రితం దీని మీద హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. శ్రీతేజ్‌కు వెంటిలేటర్ మీద కృత్రిమ శ్వాసను అందిస్తున్నామని చెప్పారు. By Manogna alamuru 17 Dec 2024 in హైదరాబాద్ Latest News In Telugu New Update షేర్ చేయండి సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో విపరీతంగా గాయపడిన శ్రీతేజ్ చావు బుతుకుల మధ్య పోరాడుతున్నాడు. దాదాపు పదిరోజులుగ ఈపిల్లాడు ఆసపత్రిలనే ఉన్నాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొంత సేపటి క్రితం కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ఏం చెప్పలేం.. వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నామని చెప్పారు. అతని జ్వరం పెరుగుతోందని కానీ మినిమం ఐనోట్రోప్స్‌లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయని తెలిపారు. ఫీడ్‌లను బాగానే తట్టుకుంటున్నాడు కానీ దీని బట్టి అతను పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాని మాత్రం చెప్పలేమని అంటున్నారు. ఎప్పుడు ఏమవుతోందో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. స్టాటిక్ న్యూరోలాజికల్ స్థితి దృష్ట్యా, వెంటిలేటర్ నుండి బయటకు తీసుకురావడానికి ట్రాకియోస్టోమీని ప్లాన్ చేస్తున్నారని కిమ్స్ వైద్యులు తెలిపారు. శ్రీతేజ్‌కు మెదడుకి ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదని కిమ్స వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామని చెప్పారు. ఇలా ఎంత కాలం ఉండాల్సి వస్తుందో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. విషమంగానే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిహెల్త్ బులిటెన్ విడుదల చేసిన KIMS ఆసుపత్రివెంటిలేటర్ పై శ్రీ తేజ్ కు కృత్రిమ శ్వాస అందిస్తున్న వైద్యులు pic.twitter.com/7rBzuy44G4 — Tharun Reddy (@Tarunkethireddy) December 17, 2024 Also Read: NEET: 2025 నీట్ పరీక్ష తేదీ ఖరారు..ఈసారైనా సవ్యంగా జరిగేనా.. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి