NEET: 2025 నీట్ పరీక్ష తేదీ ఖరారు..ఈసారైనా సవ్యంగా జరిగేనా.. 2025 నీట్ పరీక్ష తేదీ ఖరారు చేశారు. ఎన్నో సందేహాల నడుమ ఈ పరీక్షను వచ్చే ఏడాది జూన్ 15వ తేదీన నిర్వహిస్తామని నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా 2000కి పైగా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. By Manogna alamuru 17 Dec 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి వైద్యశాస్త్రంలో ప్రవేశం పొందేందుకు నిర్వహించే పరీక్ష నీట్. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్...నీట్ అనేది ఇంటర్మీడియెట్ విద్యార్థులు మెడికల్ కోర్సులలో, ముఖ్యంగా ఎంబీబీఎస్, బిడీఎస్, బీఎంఎస్, ఆయుర్వేద, యోగా, న్యాచురల్ ఔషధం కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు ఉత్తీర్ణులవ్వడానికి నిర్వహించే అర్హత పరీక్ష ఇది. ఈ పరీక్షను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఆల్ ఇండియాకు ఒకటే ఎగ్జామ్ జరుగుతుంది. 2000కి పైగా కేంద్రాల్లో నిర్వహిస్తారు. అయితే లాస్ట్ ఇయర్ నీట్ పరీక్ష ఎన్ని వివాదాలకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పరీక్ష నిర్వహిస్తారా లేదా ఎలా చేస్తారు అంటూ సందేహాలు వెలువడ్డాయి. కానీ చివరకు 2025 నీట్ పరీక్ష తేదీ ఖరారు చేశారు. వచ్చే ఏడాది... 2025 నీట్ ఎగ్జామ్ ను వచ్చే ఏడాది జూన్ 15వ తేదీని నిర్వహించనున్నట్లు నేషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు జులై 31, 2025 నాటికి ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 52 వేల పీజీ సీట్ల కోసం సుమారు 2 లక్షల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు పోటీపడే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించాలంటే కూడా అనుమతి పొందిన మెడికల్ కాలేజీల్లోనే సీట్లు పొందాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేసింది. నిర్దేశిత గడువులోగా వైద్యవిద్య పూర్తి, క్లినికల్, నాన్ క్లినికల్ అంశాల్లో శిక్షణ పొందాలని చెప్పింది. Also Read: Stock Market:చివర్లో అంతా తారుమారు...రోజంతా బాగుండి చివరకు నష్టాల్లో.. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి