JANAWADA: జన్వాడ పార్టీ కేసు ఎఫ్ ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం రాత్రి 11:30 నిమిషాలకు ఫామ్ హౌస్‌కు చేరుకున్న పోలీసులు.. మహిళలు, పురుషులు వేర్వేరుగా రెండు బృందాలు కూర్చొని మద్యం సేవిస్తుండగా పట్టుకున్నట్లు ఎఫ్ ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే పోలీసులను చూడగానే పారిపోయేందుకు పలువురు ప్రయత్నం చేశారని, ఈ క్రమంలోనే 16 మంది మహిళలు, 22 మంది పురుషులు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Nag Ashwin: ఆ మూడు సినిమాలు కలిపితే 'కల్కి 2'.. అంచనాలు పెంచేసిన నాగ్ అశ్విన్
ఫామ్‌హౌజ్‌లో కొకైన్..
పురుషులకు డ్రగ్ శాంపిల్ కిట్ ద్వారా మూత్ర పరీక్ష నిర్వహించగా వారిలో విజయ్ మద్దూరి యూరిన్ టెస్టులో కొకైన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. డ్రగ్ శాంపిల్ కిట్‌తో టెస్టుకు మహిళలు నిరాకరించాగా.. పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరిని ప్రత్యేకంగా విచారించారు. విజయ్ తన వెంట కొకైన్ తెచ్చుకున్నాడా? లేక ఫామ్‌హౌజ్‌లో ఉందా? అనే కోణంలో విచారించి.. రాజ్‌పాకాల సూచన మేరకే విజయ్ డ్రగ్స్ తీసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: KCR: ఫామ్‌హౌస్ ఇష్యూపై కేసీఆర్ సీరియస్.. డీజీపీకి ఫోన్ చేసి!
పాకాల కంపెనీకి విజయ్ సీఈవో..
ఇక పాకాల రాజేంద్రప్రసాద్‌కు ETG పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉండగా.. ఆ కంపెనీకి విజయ్ సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. విజయ్ మద్దూరికి సొంతంగా FUSION AIX పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీ కూడా ఉంది. ఐదేళ్లుగా విజయ్ మద్దూరి, పాకాల రాజేంద్రప్రసాద్ మధ్య స్నేహం కొనసాగుతుండగా.. కొత్త ఇంట్లో దీపావళి పార్టీకి రావాలని విజయ్‌ను ఆహ్వానించాడు పాకాల రాజ్. దీంతో రాజ్ సూచనతోనే విజయ్ మద్దూరి కొకైన్ సేవించినట్లు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. అలాగే పెద్ద ఎత్తున ప్లయింగ్ కార్డులను గుర్తించిన పోలీసులు గుర్తించారు. ఎక్సైజ్ పోలీసులు పలు విలువైన మద్యం బాటిళ్లను సీజ్ చేశారు.
ఇది కూడా చదవండి: అప్పుడు దూకుడు..ఇప్పుడు ఆగుడు.. HYDRA 100 డేస్ ప్రోగ్రస్ రిపోర్ట్ ఇదే!
ఇది కూడా చదవండి: Revanth Reddy: మల్లారెడ్డి మనవరాలి వివాహానికి హాజరైన రేవంత్ రెడ్డి-VIDEO