/rtv/media/media_files/2025/09/05/ganesh-laddu-2025-09-05-16-33-21.jpg)
హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలే కాదు లడ్డూ వేలంపాట చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం చాలా లడ్డూలు వేలంలో రికార్డు ధరలు పలుకుతున్నాయి. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును ఎక్కువగా సామాజిక సేవ, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉపయోగిస్తారు. హైదరాబాద్ లో అత్యంత ప్రముఖమైన, రికార్డు సృష్టించిన లడ్డూ వేలాల వివరాలు ఎంటో ఇప్పుడు చూద్దాం.
బాలాపూర్ గణేష్ లడ్డూ
బాలాపూర్ లడ్డూ వేలంపాట హైదరాబాద్ లో చాలా ఫేమస్.. ఈ వేలం 1994లో కేవలం రూ.450తో మొదలైంది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ధరలతో ఇది రికార్డులను సృష్టిస్తోంది. ఈ లడ్డూను గెలుచుకున్నవారికి అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయని ప్రజలు బలంగా నమ్ముతారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామాభివృద్ధి, సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తారు.
2024లో రూ. 30లక్షలు
2023లో రూ.27 లక్షలు
2022లో రూ.24 లక్షలు
2021లో రూ.18 లక్షలు
మై హోమ్ భూజా గణేష్ లడ్డూ
రాయదుర్గంలోని మై హోమ్ భూజాలో గణేష్ లడ్డూ కూడా చాలా ఫేమస్. ఈ లడ్డూ వేలంపాట ప్రతి సంవత్సరం రికార్డు ధరలు పలుకుతోంది. ఈ ఏడాది ఖమ్మంకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేశ్ రూ.51,07,777 లకు పాడుకొని ఈ లడ్డూను సొంతం చేసుకున్నాడు. గత ఏడాది మైహోమ్ భుజ లడ్డూను ఆయనే రూ.29 లక్షలకు పాడారు.
2025లో రూ. 51లక్షలు
2024లో రూ. 29 లక్షలు
2023లో 25.50 లక్షలు
2022లో 20.50 లక్షలు
2021లో రూ.18.5 లక్షలు
కీర్తి రిచ్మండ్ విల్లాస్ గణేశ్ లడ్డూ
బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణేష్ లడ్డూ గతేడాది అనూహ్యంగా అధిక ధర పలికి వార్తల్లో నిలిచింది. గతేడాది రూ.1.87 కోట్లకు చేరుకుంది . ఇది రాష్ట్రంలోనే రికార్డు. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని సాధారణంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు.
2024లో కోటి 87 లక్షల రూపాయిలు
2023లో కోటి26 లక్షల రూపాయిలు
2022లో రూ. 60 లక్షలు
2021: రూ.41 లక్షలు
2020: కోవిడ్-19 కారణంగా వేలం జరగలేదు.
2019: రూ. 18.75 లక్షలు