OYO: ఓయో బుకింగ్స్‌లో హైదరాబాదే టాప్

హైదరాబాద్ వాసులు ఓయోను తెగ వాడేస్తున్నారు. దేశం మొత్తంలో ఓయోను బుక్ చేసుకున్న వారిలో హైదరాబాదీయులు అత్యధికంగా ఉన్నారని చెబుతున్నారు. 2024 బుకింగ్స్‌కు సంబంధించి  ఓయో ట్రావెలోపీడియాను విడుదల చేసింది. 

author-image
By Manogna alamuru
New Update
hotels

OYO Hotels Photograph: (Google)

భారతదేశంలో గుళ్ళు, గోపురాలు ఉన్న ప్రదేశాల్లో పర్యాటకం చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ ఎక్కువగా హోటల్స్ బుక్ అవుతుంటాయి.  ఆ తరువాత ఢిల్లీ, ముంబయ్ లాంటి పర్యాటక ప్రదేశాల్లో ఎక్కువగా అవుతాయి. కానీ ఈ సారి హైదరాబాద్‌లో ఎక్కువ ఓయో హోటల్స్‌ ను బెఉక్ చేసుకున్నారని చెబుతున్నారు. ఓయోరిలీజ్ చేసిన ట్రావెలోపీడియాల దేశంలో అత్యధికంగా హోటల్స్ బుక్ చేసుకున్న నగరాల్లో హైదరాబాద్ టాప్‌లో నిలిచింది. 

తెగ తిరిగేశారు..

ఓయో విడుదల చేసిన లిస్ట్‌లో టాప్ పుణ్యక్షేత్రాల్లో ఈ ఏడాది భారతీయులు ఎక్కువగా పూరి, వారణాసి, హరిద్వార్ ఉన్నయని తెలిపింది. వీటితో పాటు దేవఘర్, పళని, గోవర్ధన్‌లలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది. ఇక నగరాల విషయానికి వస్తే హైదరాబాద్ తరువాత బెంళూరు, ఢిల్లీ, కోలకత్తా నిలిచాయి. మరోవైపు  ఉత్తరప్రదేశ్‌ ప్రయాణించడానికి అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అలాగే పాట్నా, రాజమండ్రి, హుబ్లీ వంటి చిన్న నగరాల్లో ఈ ఏడాది బుకింగ్‌లు 48 శాతం వరకు పెరిగాయి. “ఈ సంవత్సరం సెలవుల సమయంలో ప్రయాణ కార్యకలాపాలు కూడా పెరిగాయని ఓయో తెలిపింది. గోవా, పుదుచ్చేరి, మైసూర్ వంటి ఎవర్‌గ్రీన్ గమ్యస్థానాల తర్వాత జైపూర్ పర్యాటక కేంద్రంగా కొనసాగుతోంది. అయితే ముంబైలో బుకింగ్స్ తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది పర్యాటక రంగం మంచి ఊపు మీద సాగిందని ఓయో చీఫ్ శ్రీరంగ్ తెలిపారు. 

తక్కువ ధరలకే స్టే అనే కాన్సెప్ట్‌తో 2021లో ఓయో ను మొదలుపెట్టారు. ఇదొక పెద్ద సంచలనం. చాలా తక్కువ కాలంలోనే పాపులారిటీ సంపాదించుకుంది ఓయో. దీని వెనుక రితేశ్‌ అగర్వాల్‌ యువకుడి కృషి, పట్టుదల ఉన్నాయి. చిన్న వయసులోనే కొత్త ఆలోచనతో ముందుకు వచ్చి సక్సెస్ సాధించాడు రితేశ్. ఈయనే ప్రస్తుతం ఓయో సీఈఓగా కొనసాగుతున్నారు.

Also Read: UP: మహా కుభమేళా కోసం అండర్ వాటర్ డ్రోన్లు

Advertisment
తాజా కథనాలు