/rtv/media/media_files/2025/08/19/gandhi-hospital-2025-08-19-12-50-37.jpg)
Gandhi Hospital
HYD: ఖైదీని ఆరోగ్య పరీక్షల కోసమని ఆస్పత్రికి తీసుకెళ్తే.. పోలీసులు కళ్లుకప్పి తప్పించుకొని పారిపోయాడు! సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే రెండు రోజుల క్రితం సోహైల్ అనే వ్యక్తిని బేగంపేటలో ఓ దోపిడీ కేసులో పోలీసుల అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని చర్లపల్లి జైలుకి తరలించే ముందు వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఖైదీ పోలీసుల కళ్ళు కప్పి ఆస్పత్రి వాష్ రూమ్ వెంటిలేటర్ నుంచి దూకి పరారయ్యాడు. సోహైల్ గతంలో కూడా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.