ORRపై యూట్యూబర్ పిచ్చి చేష్టలు.. గాల్లోకి 20వేల నోట్ల కట్ట.. చివరికి ఏమైందంటే!

హైదరాబాద్ ORRపై యూట్యూబర్ భానుచందర్ పిచ్చి చేష్టలకు పాల్పడ్డాడు. రోడ్డు పక్కన చెట్లల్లోకి 20వేల నోట్ల కట్టను విసిరేసి ‘మనీ హంట్’ ఛాలెంజ్ అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో జనాలు డబ్బులు తీసుకునేందుకు ORRపైకి వెళ్లడంతో ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది.

New Update

Viral Video: సోషల్ మీడియాలో తమ రీల్స్ కి లక్షల్లో లైకులు రావాలి, వేలల్లో ఫాలోవర్స్ పెరగాలి, దెబ్బకు సోషల్ మీడియాలో స్టార్ అవ్వాలనే కొంతమంది పిచ్చి పరాకాష్టకు చేరుతోంది. లైక్స్, ఫాలోవర్ల కోసం ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము అనే సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. దీని వల్ల కొంతమంది తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటే.. మరి కొంత మంది ప్రజల ప్రాణాలను రిస్క్ లో పడేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 

మనీ హంటింగ్ ఛాలెంజ్

బాలానగర్ కు చెందిన భానుచందర్‌ అలియాస్‌  చందు అనే యూట్యూబర్ ORR ఎగ్జిట్ నంబర్  9 వద్ద రోడ్డు పక్కనే ఉన్న చెట్లలోకి  20 వేల నోట్ల కట్టను విసిరేసి .. ‘మనీ హంటింగ్ ఛాలెంజ్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఆ నోట్ల కట్టను వెతికి డబ్బులు పొందండి అని వీక్షకులకు ఛాలెంజ్ పెట్టాడు. దీంతో ఆ డబ్బు కోసం జనాలు ORR రోడ్డు పైకి భారీగా వచ్చారు. తమ వాహనాలను రోడ్డుపైనే ఆపి యూట్యూబర్ విసిరిన డబ్బును వెతకడం మొదలు పెట్టారు. 

Also Read: అనుదీప్ సినిమాలో నటించేందుకు మేకర్స్ బంపర్ ఆఫర్..ఈ పని చేస్తే చాలు

కేసు నమోదు

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భానుచందర్ తీరుపై   పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాను చందర్ చర్య ప్రజల ప్రాణాలకు, రోడ్డు భద్రతకు ప్రమాదం హాని కలిగించేలా ఉందని పలువురు నెటిజన్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ మేరకు పోలీసులు భానుచందర్ పై Cr. No:  నెం: 659/2024, సెక్షన్ 125, 292 BNS, జాతీయ రహదారి చట్టంలోని సెక్షన్ 8(1b) కింద కేసు నమోదు చేశారు. 

Also Read:  తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థుల‌కు ఊర‌ట‌.. హైకోర్టు కీలక తీర్పు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు