Hyderabad: శత్రువు పై పగతో రగిలిపోవడం.. వేట కొడవళ్ళతో వెంటాడి వెంటాడి చంపడం, బాంబులు విసరడం లాంటి ఫ్యాక్షన్ సీన్లు సినిమాల్లో మాత్రమే చూసుంటారు. ఒకవేళ ఇలాంటి సీన్ నిజజీవితంలో జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకున్నారా..? ఆమ్మో ఆ ఊహే భయంకరంగా ఉంది కదా..? ఇప్పుడు హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు.. ఒక చిన్న గొడవ కారణంగా శత్రులుగా మారారు. అందులో ఒకడు మాత్రం పగతో రగిలిపోతూ ఉన్నాడు. తీరని కక్షతో ఫ్రెండ్ పై వేట కొడవళ్ళతో దాడి చేశాడు! అసలేం జరిగిందంటే..
Also Read: 'భారతీ.. ట్యూషన్ ఫీజు కట్టావా'.. అబ్బా! ఈగ సినిమా లెవెల్లో రాజమౌళి ఫస్ట్ లవ్
వేటకొడవళ్లతో దాడి..
హైదరాబాద్ కొత్తపేటలో పురుషోత్తం అనే వ్యక్తి పై మహేష్ వేట కొడవళ్ళతో దాడికి పాల్పడ్డాడు. అయితే గతంలో మహేష్, పురుషోత్తం మంచి స్నేహితులు. కాగా, 2022లో ఓ పెళ్లి భారత్ లో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో పురుషోత్తం మహేష్ ను బీర్ బాటిల్ తో కొట్టాడు. దీని పై కేసు నమోదవగా.. పురుషోత్తం.. మహేష్‌తో 4 లక్షలకు రాజీ కుదుర్చుకున్నాడు. అయితే ఈ కేసు విచారణకై ఇటీవలే హయత్ నగర్ కోర్టులో విచారణ ఉండగా.. మహేష్ కోర్టు విచారణకు రాకుండా పురుషోత్తంపై కొడవళ్ళతో దాడికి దిగాడు. అదృష్టవశాత్తు ఈ దాడి నుంచి పురుషోత్తం తప్పించుకోగా.. అతడి స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు.
ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా
Also Read: ఆ లీక్డ్ ఫొటోతో ఎలాంటి సంబంధం లేదు.. నిధి ఇన్‌స్టా పోస్ట్ వైరల్!